Thursday, September 18, 2025

వన్డేల్లో 50 సెంచరీలు: సచిన్ ను దాటేసిన కోహ్లీ

- Advertisement -
- Advertisement -

కింగ్ కోహ్లీ మరో అద్భుతం సాధించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మన్ గా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. న్యూజీలాండ్ తో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధించి, అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా తన పేరిట రికార్డు నెలకొల్పుకున్నాడు.

సచిన్ 451 ఇన్నింగ్సులో 49 సెంచరీలు సాధించగా, కోహ్లీ కేవలం 279 ఇన్నింగ్సులోనే 50 సెంచరీలు సాధించడం విశేషం. ఇదే మ్యాచ్ లో సచిన్ మరో రికార్డును కూడా కోహ్లీ బద్దలుకొట్టాడు. 2003 ప్రపంచకప్ లో 673 పరుగులు చేసిన సచిన్ పేరిట అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఉండేది. ఈ రికార్డును కూడా కోహ్లీ అధిగమించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News