Tuesday, December 3, 2024

విరాట్ కోహ్లీ శతకం…

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో, చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. ఆదివారం(నాలుగో రోజు) 289/3తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 400 పరుగుల మార్క్ ను దాటింది. రవీంద్ర జడేజా(28) నిరాశపర్చగా.. వికెట్ కీపర్ కెఎస్ భరత్(44) వేగంగా బ్యాటింగ్ చేసి ఔటయ్యాడు.

మరోవైపు కోహ్లీ వికెట్ కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 245 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో శతకం సాధించాడు. ప్రస్తుతం భారత్ 5 వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(110), అక్షర్ పటేల్(07)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News