Monday, September 1, 2025

సోమవారం రాశి ఫలాలు (01-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం- వృత్తి- ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిత్రులతో కలిసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటా బయట ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

వృషభం- దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరంగా ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంత లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం.

మిథునం- జీవిత భాగస్వామితో స్వల్ప మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.  కొంతమంది మీపై దుష్ప్రచారాలు చేస్తారు. ఇది మీ మానసిక వేదనకు కారణం అవుతుంది.

కర్కాటకం- చిన్న మొత్తాలలో ఉన్న అప్పులు తీర్చి వేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి. మిత్రులతో సన్నిహితులతో కలిసి ఆనందంగా గడపగలుగుతారు.

సింహం- బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపగలుగుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఉన్నత విద్యను అభ్యసించడానికి కొత్త మిత్రులను కలిసి సలహాలు సూచనలు తీసుకుంటారు.

కన్య- మానసిక ధైర్యం పెంచుకోగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి.

తుల- దృడ నిచ్చయంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు.  బిల్లులను సకాలంలో చెల్లించ గలుగుతారు. రావలసిన ధనం అంతంత మాత్రమే చేతికంది వస్తుంది.

Also read:  ఆ వ్యాధి సోకిందని… దేవుడిపై కోపంతో… ఏం చేశాడో తెలిస్తే షాక్

వృశ్చికం- వృత్తి ఉద్యోగాలలో నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనం అధికంగా ఖర్చు అయ్యే సూచన.

ధనస్సు: రుణ ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు.

కుంభం: వృత్తి- ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అంతరంగిక మిత్రుల నుండి సలహాలు సూచనలు ఎక్కువగా తీసుకుంటారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మీనం: మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి.  ప్రయాణాలు లభిస్తాయి జీవిత భాగస్వామి నుండి కొంత ధన లాభం పొందుతారు.

Rasi phalalu cheppandi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News