Monday, January 30, 2023

ఒక ఎనిమిది నిమిషాలు థియేటర్ మొత్తం పూనకాలే: డైరెక్టర్ బాబీ

- Advertisement -

ఎనిమిది నిమిషాలు థియేటర్ మొత్తం పూనకాలే..
అన్నయ్యకు ఇస్తున్న చిరు కానుక ‘వాల్తేరు వీరయ్య’: డైరెక్టర్ బాబీ
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా వచ్చిన మూడవ సింగిల్ ‘వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్’ కూడా సంచలన విజయం సాధించింది. భారీ అంచనాలు వున్న వాల్తేరు వీరయ్య జనవరి 13,2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. వాల్తేరు వీరయ్య కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో గ్రాండ్ గా జరిగిన ఈ ప్రెస్ మీట్ లో… మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Waltair Veerayya Movie Press Meet

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. ”మెగాస్టార్ తో సినిమా చేస్తున్నపుడు మన అభిమానం, ప్యాషన్ ఇవన్నీ పక్కన పెట్టిసి.. మనం ఆరాధించే దేవుడు, శక్తి, వ్యక్తి మన కళ్ళ ముందు వున్నపుడు సినిమాలో ఏం పెట్టాలో అన్నీ ఇందులో పెట్టేశాం. అన్నయ్య నన్ను ఓ తమ్ముడిలా చేయిపట్టి నడిపించారు. ఆయన కారణంగానే అద్భుతమైన కథ రెడీ అయ్యింది. సెకండ్ హాఫ్ మీద పని చేస్తున్నపుడు రవితేజ లాంటి ఒక పాత్ర వుందని అన్నయ్య కి చెబితే.. ‘’బావుంది ఇదే చేస్తున్నాం’ అన్నారు. హ్యాట్సప్ టు యూ అన్నయ్య. కథ మొత్తం లాక్ అయిన తర్వాత రవితేజకి చెప్పాను. కథ వినగానే సినిమాలో జాయిన్ అయిన రవితేజకి కృతజ్ఞతలు. ఇలాంటి ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ని ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. శ్రుతి హాసన్ పాత్ర అద్భుతంగా వుంటుంది. కేథరిన్ కూడా చక్కగా చేసింది.

దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. విల్సన్ వండర్ పుల్ డీవోపీ అందించారు. ప్రకాష్ అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇచ్చారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఎక్స టార్డీనరీ ఫైట్స్ ఇచ్చారు. బోస్ అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. బాస్ పార్టీ సాంగ్ లో ఊర్వశి అద్భుతమైన ఫెర్ ఫార్మ్ చేసింది. శేఖర్ మాస్టర్ చిరంజీవి గారి గ్రేస్ కి తగ్గట్టు పాటలకు కొరియోగ్రఫీ ఇచ్చారు. డ్యాన్సులని ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. రైటింగ్ డిపార్ట్ మెంట్ కి థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్య మాస్ జాతర. మెగాస్టార్ వార్ కి వస్తే ఎలా వుంటుందో శంఖం ఊదితే ఎలా గూస్ బంప్స్ వస్తాయో.. ఒక ఎనిమిది నిమిషాల పాటు థియేటర్ మొత్తం పూనకాలని ఊరికే ట్యాగ్ పెట్టలేదని గట్టి నమ్మకంతో చెబుతున్నాను. పూనకాలు లోడింగ్ హైప్ కోసం పెట్టింది కాదు. మనకు ఎన్నో సార్లు పూనకాలు ఇచ్చిన అన్నయ్య కి తిరిగి చిరు కానుక గా ఇస్తున్న సినిమా ఇది’’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles