నార్త్, సౌత్ అన్న తే డా లేకుండా యష్‌రాజ్ ఫిలిమ్స్ (వైఆర్‌ఎఫ్) స్పై యూనివర్స్ నుంచి వ చ్చి చిత్రాలపై అందరి దృష్టి పడుతుంది. ఇక ఈ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’లో(War 2)కబీర్ పాత్రతో తిరిగి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఇక ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగ తి తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా అప్డేట్ రాబోతోందని హృతి క్ రోషన్ హింట్ ఇచ్చారు. ఈ మేరకు హృతిక్ ట్వీట్ చేస్తూ.. “హే తారక్, ఈ సంవత్సరం మే 20న ఏ అప్డేట్ రాబోతోందో? అసలు ఏం జరగబోతోందో నీకు తెలుసా? నువ్వు అస్సలు ఊహించలేవు.. మీరంతా సిద్ధంగా ఉన్నా రా?”అని సినిమాపై అంచనాలను పెంచేశారు. హృతిక్ అలా ట్వీట్ చేశాడో లేదో ఇలా ఒక్కసారిగా ఇది ట్విట్టర్‌ను షేక్ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘వార్ 2’పై ఇప్పుడు వరల్ వైడ్‌గా క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇండియన్ సూపర్ స్టార్లయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు ఒకే చిత్రంలో నటిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.
బర్త్‌డేకు ‘వార్ 2’ నుంచి సర్‌ప్రైజ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -