Sunday, September 15, 2024

కూతురికి ఉరేసిన వరంగల్ జర్నలిస్ట్…. ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: వరంగల్ యువ జర్నలిస్ట్ యోగి తన కూతురుకు ఉరేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. తొలి వెలుగు ఛానెల్ లో వరంగల్ స్టాఫర్ గా యోగి రెడ్డి పని చేస్తున్నారు. హన్మకొండలోని ఏకశిలా పార్కు సమీపంలో ఒక రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో ఎవరూ స్పందించకపోవడంతో డోర్లు బలవంతంగా ఓపెన్ చేశారు. యోగి తన కూతురుకు ఉరేసి అనంతరం అతడు ఉరేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న కూతురును జర్నలిస్టులు ఆస్పత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. ఆర్థిక సమస్యలతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి వెలుగు ఛానెల్ నుంచి అతడిని తొలగించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News