మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యా ప్తంగా గత వారంరోజులుగా ఏకతాటిగా కు రుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. అనూహ్యంగా కొన్ని గం టల పాటే పడుతున్న వర్షాల వల్ల ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. వర్షపు నీరుతో పాటుగా పై నుంచి వచ్చే వరద నీటి తో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పు డు నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తూ లో తట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులను కలెక్టర్లు సమీక్షిస్తున్న యం త్రాంగాన్ని అందుబాటులో ఉంచుతున్నా రు. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా
యి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో నదులలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణ నది కి వరద పో టెత్తింది. దీంతో ఆ నదిపై ఉన్న జూరాల, శ్రీ శైలం, నాగార్జున సాగర్, టైల్ పాండ్, పులిచింత ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది నుంచి వస్తున్న వరదతో పాటు, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా బుడమేరు, పాలేరు వాగులు ప్రకాశం బ్యారేజికి పోటెత్తాయి. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ప్రకాశం బ్యారేజీ అన్ని గేట్లను పైకి ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలివేస్తున్నారు.ఎగువన జూరాల, తుంగభద్ర నుంచి భారీ వరద శ్రీశైలానికి చేరుతోం ది. దాంతో అధికారులు అప్రమత్తమై నాలు గు గేట్లను రెండు అడుగులు ఎత్తి వచ్చిన వ రదను వచ్చినట్లు విడుదల చేస్తున్నారు. ప్ర స్తుతం శ్రీశైలానికి ఇన్ ప్లో 1,74,197 క్యూసెక్కులు వస్తుండగా, నాలుగు గేట్లు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు 1,72,800 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 882.10 అడుగుల వద్ద కొనసాగుతుంది.
సాగర్‌లో ఇరవై గేట్ల ఎత్తివేత
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం ఎక్కువగా చేరుతోంది. శనివారం నాగార్జున సాగర్ జలాశయంలో ఇరవై క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి వేసి 1.56 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలిపెడుతున్నారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగుటు కాగా, ప్రస్తుతం 587.57 అడుగట వద్ద నీటి నిల్వలు ఉన్నాయి. డ్యామ్ పూర్తిస్థాయి నీటి సామర్ధం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతం 305 టిఎంసిల నీరు నిల్వ ఉంది.
జలాశయాలకు భారీగా నీరు
వర్షాల వల్ల కడెం, జూరాల, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జలశయాలకు భారీగా నీరుచేరుతుంది. నిర్మల్ జిల్లా కడెం జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో ఎడతెరపి లేని వర్షాలకు జలాశయంలో వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టులోకి పది వేల488 క్యూసెక్కుల నీరు చేరుతుంది. దీంతో అధికారులు రెండు వరద గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 692 అడుగులకు చేరుకుంది.
జూరాలకు వరద ప్రవాహం
జూరాల జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.96 లక్షల క్యూసెక్కులు ఉండగా, జలాశయం 42 గేట్ల ద్వారా 1.92 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. జారాల పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.66 మీటర్లుకు చేరుకుంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 6.18 టీఎంసీలకు చేరినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
శ్రీపాద ఎల్లంపల్లి నీరు విడుదల
పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు పది గేట్లు 0.5 మీటర్ల వరకు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని, మంచిర్యాల, రామగుండం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఇ) గుప్తా సూచించారు.
కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
నిర్మల్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం వల్ల నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి 22 ,896 క్యూసెక్కుల నీటికి అధికారులు దిగువకు విడుదల చేశారు. స్వర్ణ ప్రాజెక్టు లో వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో ఒక గేటును ఎత్తివేసి 1,182 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు. బైంసా గడ్డం సుద్ధ వాగు ప్రాజెక్టు వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రెండు గంటల పాటు గేట్లను ఎత్తివేసి ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిర్మల్ నిర్మల్ జిల్లాలో అప్రమత్తత
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు పరిసరాలకు ఎవ్వరూ వెళ్లరాదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలకు ప్రజలెవ్వరూ వెళ్లవద్దని, ముఖ్యంగా పశువుల కాపరులు తమ పశువులను నది-వాగుల దారుల్లోకి తీసుకువెళ్లరాదని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షణలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టే మత్యాకారులు, రైతులు వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం 24 గంటల పాటు అప్రమత్తంగా ఉన్నారని, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. నిర్మల్ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 91005 77132 ను సంప్రదించాలని కోరారు.