Friday, September 13, 2024

శ్రీశైలం ప్రాజెక్టు 10గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక మహారాష్ట్ర ల నుంచి 286,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో గురువారం పది గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ నుంచి 294,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 39 గేట్లను ఎత్తి జూరాల అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 20,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 2,86,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయంలో 885 అడుగులకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 884.80 అడుగులలో నీరు నిల్వ ఉంది. టీఎంసీలలో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 214.3637 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిండడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా తలపిస్తుంది. ఎగువ కర్ణాటక మహారాష్ట్రలలో వర్షాలు కురుస్తుండడంతో మరో వారం రోజులపాటు శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 10 గేట్లు ఎత్తడం ద్వారా దిగువ నాగార్జునసాగర్ కు 2లక్షల 79 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా ఏపీ తెలంగాణ జల విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 67,000 క్యూ సెక్కులు నాగార్జునసాగర్ వైపుకు వదులుతున్నారు. రెండు రోజులుగా ఎవరిని చూస్తున్న వరద ఆధారంగా క్రమక్రమంగా గేట్లను ఎత్తుతూ శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. రెండవ పర్యాయం గేట్లను తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News