Sunday, September 15, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు రెండు రోజులు భారీవర్షాలు

- Advertisement -
- Advertisement -

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్,

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఎల్లుండి శనివారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహాబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ సంచాలకులు వివరించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో అప్రమత్తం:
మరోవైపు రాష్ట్రానికి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం :
మరోవైపు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల 30న పశ్చిమ – మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల మీదుగా దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ-మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News