Tuesday, May 14, 2024

నెలన్నరగా లీకేజీ.. కలుషిత నీరు తాగుతున్న ప్రజలు

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: విష జ్వరాలు వచ్చి.. ప్రజలు రోగాల భారిన పడితే తప్ప అధికారులు స్పందించేటట్లు లేరు. మండల పరిధిలోని ఖానాపూర్‌లోని హనుమాన్ దేవాలయం సమీపంలో పైప్‌లైన్ లీకేజీ అయ్యింది. సుమారుగా రెండు నెలలు కావోస్తున్నప్పటికి లీకేజీని సరిచేయడం లేదు. అంతేకాకుండా పైప్‌లైన్ లీకేజీ అయిన ప్రా ంతంలోనే బాత్రూంకు సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఉంది. లీకేజీ అవుతున్న పైప్‌లైన్ ద్వారా నీళ్ళు వెళ్ళున్న క్రమంలో మంచినీళ్ళు కలుషితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పైపులైన్ లీకేజికి సరిచేయాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు తాత్సారం ప్రదర్శిస్తున్నారు. లీ కేజీ అవుతున్నప్పటికి పంచాయితీ కార్యదర్శి యశ్వంత్, సర్పంచ్ న ర్సింహులు దృష్టికి తీసుకెళ్లినప్పటికి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా లీకేజీని సరిచేయకపోవడంతో గుంతలో పడిపోయే ప్రమాదం ఉంది. లీకేజీని సరిచేయకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కలుషిత నీరును త్రాగడం వల్లన పలు గ్రామాల్లో వైరల్ ఫీవర్స్‌తో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తెలిసినప్పటికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవ్యహరించడం చర్చకు దారీ తీస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి, గ్రామస్థులకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News