Sunday, April 28, 2024

మతం పేరుతో జరిగే దాడులను ఖండిస్తున్నాం

- Advertisement -
- Advertisement -

జన్వాడలో దళితులపై దాడి చుండూరు, కారంచేడు లాంటిదే!
మైనారిటీల ప్రాణాలకు ప్రభుత్వ గ్యారంటీ కావాలి:  డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: మతం పేరుతో కొన్ని మతతత్వ మూకలు ఒక వర్గానికి చెందిన మత మైనారిటీలు,దళితులపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జన్వాడలో క్రైస్తవులపై జరిగిన దాడిని ఖండిస్తూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లోనిర్వహించిన శాంతియత ర్యాలీ, సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జన్వాడలో ఒక వర్గంపై ఆర్‌ఎస్‌ఎస్ మూకలు మతం పేరుతో క్రైస్తవులు, దళితులపై వ్యూహాత్మకంగా దాడులకు పాల్పడ్డారన్నారు.

మత మైనారిటీలపై జరిగే దాడులు రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన గుడి, చర్చి,మసీద్ మత ప్రచారకులపై జరిగే దాడులు చట్ట వ్యతిరేకమన్నారు. జన్వాడలో క్రైస్తవులు,దళితులపై జరిగిన దాడి చుండూరు,కారంచేడు లాంటిదేనని ప్రభుత్వం నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థన మందిరలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. రాజ్యాంగంలో అధికరణ 25 ను కాపాడాలన్నారు. మణిపూర్ లో ఇటువంటి మతపరమైన దాడులు చేసి హత్యలు చేశారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల కంటే, మత మైనారిటీల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించడానికి ప్రభుత్వానికి కాళేశ్వరం పిల్లర్ల పగుళ్ళు గుర్తుకొస్తున్నాయని… చర్చించాలి కానీ, మత మైనారిటీలపై జరిగిన దాడిని అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని పేదలపై జరిగిన దాడులు ప్రభుత్వానికి పట్టవా? అని ప్రశ్నించారు. ఇదేనా ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలన అంటూ ద్వజమెత్తారు. క్రైస్తవులు,దళితులపై చేసిన దాడులపై ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతమన్నారు. దాడులు జరిగిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించకపోతే, బాధితులకు న్యాయం ఇంకెక్కడ జరుగుతదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News