Friday, September 20, 2024

జార్ఖండ్ నుంచి బిజెపిని తరిమివేస్తాం: సిఎం హేమంత్ సోరెన్

- Advertisement -
- Advertisement -

గుమ్లా: ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను బిజెపి లోబరుచుకుంటోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత బిజెపిని రాష్ట్రం నుంచి తరిమివేస్తామని కూడా ఆయన ప్రకటించారు. గురువారం నాడిక్కడ ర్రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆప్‌కీ యోజన, ఆప్‌కీ సర్కార్, ఆప్‌కే ద్వార్ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రజలు వారిని తిరస్కరించినప్పటికీ ప్రతిపక్ష నాయకులపై ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి వారిని జైల్లో పెట్టడం లేదా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను లోబరుచుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బిజెపికి అలవాటుగా మారిందని ఆరోపించారు.

నీరు లేకుండా చేప ఎలా బతకలేదో అధికారం లేకుండా బిజెపి బతకలేదని ఆయన వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా తనను, తన ఎమ్మెల్యేలను బిజెపి వెంటాడుతోందని, అయితే తాము అమ్ముడుపోము, భయపడేవారము కామని సోరెన్ స్పష్టం చేశారు. బిజెపి స్థానిక నాయకులు జార్ఖండ్‌లో విఫలం కావడంతో ఛత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, మధ్య ప్రదేశ్ నుంచి నాయకులను దిగుమతి చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. వివిధ వర్గాల మధ్య మత ఉద్రిక్తతను రెచ్చగొట్టేందుకు ఈ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో బిజెపి అవాంతరాలు సృష్టిస్తోందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం వారికి ఇష్టం లేదని ఆయన తెలిపారు. అయితే బిజెపిని శాశ ్వతంగా రాష్ట్రం నుంచి తరిమివేయాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News