Friday, September 20, 2024

ఓవైసీ విద్యాసంస్థకు నోటీసులు ఇస్తాం: రంగనాథ్

- Advertisement -
- Advertisement -

ఓవైసీ విద్యాసంస్థకు నోటీసులు ఇస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఓవైసీ విద్యాసంస్థపై ఫిర్యాదులు వస్తున్నాయనీ, పరిశీలన చేస్తున్నామని చెప్పారు. అయితే, విద్యాసంస్థ అయినందున విద్యార్థుల అకాడమిక్ ఇయర్‌ను దృష్టిలో పెట్టుకుని పూర్తిస్థాయిలో విచారణ జరిగిన అనంతరం తుది నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. చట్టం అందరినీ సమానంగానే చూస్తుందని, సాధారణ ప్రజలకు ఒకరకంగా, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఓరకంగా ఉండదన్నారు.

జీఓ నెం. 99 ప్రకారంగా హైడ్రాకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పడిందనీ, ఆ కమిటీలోని మంత్రులకు లేదా సభ్యులకు సంబంధించిన నిర్మాణాలు చెరువుల్లో ఎఫ్‌టిఎల్‌లో ఉన్నా చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చెప్పారు. నిర్మాణాలు వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News