Saturday, December 14, 2024

వరంగల్ ని తెలంగాణ రెండో రాజధానిని చేస్తాం: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

వరంగల్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు వరంగల్ పర్యటించారు. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయం దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వరంగల్ ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలాయశంగా మారుస్తామన్నారు. భద్రకాళి చెరువును కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలావుండగా మామూనూరు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు. త్వరలో అనుమతులు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News