Monday, February 26, 2024

మంత్రి పువ్వాడపై హద్దుమీరి విమర్శలు చేస్తే సహించం

- Advertisement -
- Advertisement -
  • ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై కొందరు అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని, సంబంధం లేని విషయాలపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఇటువంటి కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సహించబోరని మాజీమంత్రి, కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం లేక్క చేయకుండా సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రిపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్ పార్టీ మంత్రులను, అధినేతపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే బిఆర్‌ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. మంత్రి పువ్వాడ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ సమస్య ఉన్న వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష, ఇతర వ్యక్తులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎత్తులు వేస్తున్నారని, తమ పార్టీ ఇటువంటి చర్యలను సమర్థవంతంగా తిప్పి కొడుతుందని పేర్కొన్నారు.

ఇకనైనా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని తప్పుడు విధానాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో వనమా రాఘవేందర్‌రావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ, వైస్ చైర్మన్ దామోదర్, ఎంపీపీ బాదావత్ శాంతి, బిఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జెవిఎస్. చౌదరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News