Monday, April 29, 2024

ప్రధాని మోడీని అడ్డుకుంటాం

- Advertisement -
- Advertisement -
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి

హైదరాబాద్ : భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేక అనర్హత వేటును ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించిన చర్య ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఆయన ఆరోపించారు.

తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ టికెఆర్ కామన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను ఎన్‌ఎస్‌యూఐ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి మాట్లాడుతూ ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మోడీ ప్రభుత్వం మోసాలను, రాక్షస పాలన గురించి పార్లమెంట్ లో ప్రశ్నిస్తే మోడీ ప్రభుత్వం వాటికి జవాబు చెప్పలేక రాహుల్ గాంధీని ఎంపిగా భర్తరఫ్ చేసి వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీని పెద్దఎత్తున అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు దీక్షిత్, రంగా రెడ్డి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News