Tuesday, October 15, 2024

వార ఫలాలు(22-09-2024 నుంచి 28-09-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు, ఆర్ధిక అంశాలు  కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం  అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి. సాఫ్ట్ వేర్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ట్స్, కన్సల్టెన్సీ వారికి అనుకూలం, రియల్ ఎస్టేట్ వారికి అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు జువెలరీ వ్యాపారస్తులకు బాగుంది అని చెప్పవచ్చు.  విద్యార్థిని విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోగా నిరాశ ఎదురవుతుంది. విదేశాల్లో ఉన్న వారికి కాలం  అనుకూలంగా ఉంది. భార్య భర్తల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  చేపట్టిన ప్రతి పనులలోను ఆటంకాలు ఎదురవుతాయి. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి.  జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.   ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మెకానికల్ ఫీల్డ్,  ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్నవారికి  మంచి గుర్తింపు లభిస్తుంది. ఐటీ రంగం వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.  కష్టానికి తగ్గ  ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారికి  వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది.  సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి  సంతాన ప్రాప్తి కలుగుతుంది.   ఫైనాన్స్ పరంగా బాగుందని చెప్పవచ్చు.  షేర్ మార్కెట్ కు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన.  ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం,  అలాగే సుబ్రమణ్య స్వామి కంకణం ధరించడం  చెప్పదగిన సూచన.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది.   ఆదాయ వ్యయాలు బాగున్నాయి.  దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగిన సూచన.  జీవిత భాగస్వామితో, సహోదర సహోదరీ వర్గంతో మంచి సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం బాగుంటుందని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి.  లోన్ విషయంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ఆరోగ్య పరంగా జాగ్రత్తలు  తీసుకోవాలి.  విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.  లక్ష్మి కుబేర రూపును వ్యాపార ప్రదేశంలో గాని ఇంట్లో పూజా మందిరంలో కానీ,  పర్సులో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం చేసే ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది.  దూరప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి.  ఆరోగ్య రిత్యా  జాగ్రత్తలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంది.  ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.  H1B, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు అనుకూల కాలం. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది.  రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు,  సాఫ్ట్ వేర్  రంగం వారికి బాగుంది అని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి.  ప్రేమ వివాహాల విషయంలో  జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయం బాగుంటుంది.  అభివృద్ధిలోకి వస్తారు.  సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి  ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది.  సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎనిమిది మంగళవారాలు అభిషేకం చేయించండి.  ఖర్చుల విషయంలో తగిన  జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి అష్టమి శని నడుస్తునందు వలన మన్యు పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు.కష్టానికి తగ్గ ఫలితం లభించదు.  పిల్లలు విషయంలో మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య రీత్యా  కడుపునొప్పి,  గ్యాస్ట్రిక్,  షుగర్ వంటివి ఇబ్బంది పెడతాయి.  విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తు బాగుంది. కష్టేఫలి అన్నది గ్రహిస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు.  విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉత్తమ కాలమని చెప్పవచ్చు.  దైవ అనుగ్రహం  వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు. సినీ రంగంలో ఉన్నవారికి,  కమ్యూనికేషన్  స్కిల్ ఉన్నవారికి,  సాఫ్ట్ వేర్ , మల్టీమీడియా రంగంలో వర్కింగ్ చేసే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం  చెప్పదగిన సూచన.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  ఉద్యోగంలో స్థానం చలనం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. సహోదర సహోదరి మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలసి వస్తాయి. సాఫ్ట్ వేర్,  రియల్ ఎస్టేట్,  సినీ ఫీల్డ్,  మ్యూజిక్,  ఈ రంగం  వారు మంచి ఫలితాలు సాధిస్తారు.  ఆర్ధిక పరంగా బాగుంటుంది.  వివాహాది శుభకార్యాల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతాన  విషయం బాగుంది.  సంతాన కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు  మంచి కాలం అని చెప్పవచ్చు.  వ్యాపారాభివృద్ధి బాగుంటుంది.  కష్టానికి తగ్గ  ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.   పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఈ రాశి వారు బుధవారం నాడు గణపతికి గరికతో  పూజ చేయండి.  లక్ష్మీ కుబేర రూపుని ఇంట్లో గాని ఆఫీస్లో గాని లేదా పర్సులో గాని పెట్టుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తుల: తులా రాశి వారికి ఈవారం బాగుందని చెప్పవచ్చు.  ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది.  ధన లాభం సూచిస్తోంది.  ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు.  ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి,  సినీ రంగం వారికి,  ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రంగంలోని వారికి,  హోటల్ మేనేజ్మెంట్  వారికి మంచి కాలం అని చెప్పవచ్చు.  వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మంచి కాలం చెప్పొచ్చు.  ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొంత ఆటంకం ఎదురవుతుంది. H1Bవీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం చెప్పవచ్చు.  పిల్లలు సంతానం పట్ల మంచి అభివృద్ధి ఉంటుంది.  వివాహ విషయంలో సంబంధాలు వచ్చినప్పుడు కుటుంబం మంచి చెడ్డలు చూసి,  జాతకాలు చూసి నిశ్చయించుకోండి.  విద్యార్థులకు ఈవారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు నువ్వుల నూనె తో దీపారాధన చేయడం, అలాగే లక్ష్మీ కుబేర  రూప్ ని ఇంట్లో గాని వ్యాపార ప్రదేశంలో గాని పర్సులో గాని ఉంచడం మంచిదని చెప్పదగిన సూచన.

వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు  తీసుకోవాలి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. గృహ నిర్మాణం చేయాలన్న కల నెరవేరుతుంది.  సోదర సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది.  టీచర్స్ కి,  మెకానికల్,  సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కి,  కన్సల్టెన్స  లో  పనిచేసే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు.వ్యాపార పరంగా బాగుంటుంది.  విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల  పరంగా మంచి లాభాలు తెచ్చి పెట్టే విధంగా ఈ వారం ఉంటుంది.  ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం అని చెప్పవచ్చు . విదేశాల్లో మంచి ఉద్యోగం  లభిస్తుంది.  దైవానుగ్రహం తోడు ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్టం శని ప్రభావం చేత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం,  మన్యు పాశుపతము చేయించడం  మంచిదని చెప్పదగిన సూచన.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు ఆదాయం బాగుంటాయి. ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది.  సంతాన అభివృద్ధి బాగుంటుంది.  సహోదర సహోదరి వర్గంతో  ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉండవు. ఉద్యోగస్తులకు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది.  కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది.  భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి.  నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.   స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టడం ఈ వారం మంచిది కాదు.  సాఫ్ట్ వేర్,  రియల్ ఎస్టేట్,  కన్సల్టెన్సీ,  చిరుధాన్యాల వ్యాపారస్తులు,  మిల్క్ ప్రొడక్ట్స్,  డ్రై ఫ్రూట్స్,  ఆయుర్వేద మెడిసిన్స్  వారికి  బాగుందని చెప్పవచ్చు. సినీ కళా రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.  విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలు  వస్తాయి,  వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి.  నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

మకరం:   మకర రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  ఆరోగ్యం పట్ల  జాగ్రత్త వహించాలి. ఖర్చు విషయంలో జాగ్రత్త ఉండాలి. ఉద్యోగ పరంగా ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్  రంగం వారికి అనుకున్న ఉద్యోగం రాదు.భాగస్వామి వ్యాపారాలు మధ్యవర్తులు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్,  కన్సల్టెన్సీ,  రియల్ ఎస్టేట్  రంగం వారికి అనుకూలం అని చెప్పవచ్చు.  సినిమా, కళా రంగంలో ఉన్న వారికి, వ్యాపార పరంగా కొంత నష్టం వాటిల్లే పరిస్థితి గోచరిస్తుంది. ఏలినాటి శని ప్రభావం చేత  పనులు నిదానంగా సాగుతాయి.  బ్యాంకు లోన్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి -ఉద్యోగాల్లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. పెద్దవాళ్ల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.  ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి,  డబ్బు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.ఈ రాశి వారు  స్త్రీలు  శనివారం నాడు నలుపు వత్తులతో శనీశ్వరుడికి దీపారాధన చేయండి.  కాలభైరవ రూపును మెడలో ధరించండి. మగవారు ఏకముఖి రుద్రాక్ష  మెడలో ధరించండి.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  అధిక ధన సూచన కనిపిస్తుంది.  దూర ప్రాంత ప్రయాణాలు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం పరవాలేదు అని చెప్పవచ్చు. రిలేషన్ వ్యాపారస్తులకు బాగుంటుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి,  స్టీల్,  చార్టెడ్ అకౌంట్స్,  బ్యాంకింగ్ సెక్టార్ వారికి ఈ వారం బాగుంది.  స్పెక్యులేషన్ కి దూరంగా ఉండాలి.  భాగస్వామి వ్యాపారాలు ఈ వారం బాగుంటాయని అని చెప్పవచ్చు.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం వ్యతిరేకంగా ఉంది. వృత్తి పరంగా అనుకూలంగా ఉన్నా వ్యాపార పరంగా అంతంత మాత్రం ఉంటుంది. విరోధులకు దూరంగా ఉండండి. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు ఈవారం బాగుందని  చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వచ్చే కాలం చెప్పవచ్చు.

­ మీనం: మీనరాశి వారికి ఈ వారం  బాగుందని చెప్పవచ్చు.నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది.ఉద్యోగస్తులకు వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా డాక్టర్స్,  మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి ఈ వారం బాగుంది.  సాఫ్ట్ వేర్ రంగానికి,  మల్టీమీడియా, గ్రాఫిక్స్  రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వచ్చిన ధనాన్ని అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది.  ఫిక్స్డ్  డిపాజిట్ ఏదైనా సరే ధనాన్ని పొదుపు చేయండి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం చేత ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వివాహం కాని వారికి  వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యం అవుతాయి.  సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మాత్రం మంచి వార్త వింటారు. ఆహార నియమాలను  పాటించండి.  విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా అని చెప్పవచ్చు,  ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్  ఉన్నవారికి బాగుంది చెప్పవచ్చు. విదేశాల్లో చదువుకోడానికి వారికి వీసా  లభిస్తుంది.  H1B, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News