Wednesday, November 13, 2024

వార ఫలాలు (06-10-2024 నుండి 12-10-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు .ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి .  వృత్తి ఉద్యోగాల పట్ల మీకున్న నమ్మకం పెరుగుతుంది . సహోద్యోగులతో మీకున్న రిలేషన్షిప్ బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఈ వారం వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. జ్యువెలరీ వ్యాపారస్తులకు పూజా సామాగ్రి వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని  చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా లేదు . ఈ వారం వివాహ ప్రయత్నాలు చేయవచ్చు మంచి సంబంధం కుదురుతుంది.  సంతాన పరంగా ఎదురు చూస్తున్న వారికి ఈ వారం కొంచెం నిరాశ .విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు.  వ్యాపారపరంగా బాగుంటుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.

 వృషభం: వృషభరాశి వారికి  ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అయినా సరే దాన్ని అధిగమించి ముందుకు  వెళ్ళడానికి ప్రయత్నించండి . ఫైనాన్స్ పరంగా  కొంత బాగున్నా ఖర్చు మటికి అధికంగా ఉంటాయి. కె రియర్ పరంగా ఈ వారం బాగుందని చెప్పొచ్చు . విదేశాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలని గోచరిస్తోంది. అనుకోని ఆకస్మిక ధన లాభం అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది . మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. నలుగురికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తారు.  వ్యాపారస్తులకు మొత్తం మీద ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుంది. విదేశాల్లో చదువుకుంటున్న వారికి కాలం బాగుంది . వీసా హెచ్ వన్ బి కోసం  ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది.  సినీ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.

మిథునం:  మిథున రాశి  వారికి  ఈ వారం బాగుందని చెప్పవచ్చు . జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఏర్పడుతుంది. ఫైనాన్స్ పరంగా కూడా ఎంతో బాగుందని చెప్పవచ్చు . ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి  వెళ్లే అవకాశం గోచరిస్తుంది.  ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది అలాగే  ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.  వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది . ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి . వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సంతాన విషయమై మంచి అభివృద్ధి ఉంటుంది. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు అలాగే  బంధుమిత్రులతో కలిసి విహార  యాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది.

కర్కాటకం :  కర్కాటకరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ప్రతి విషయానికి  ఆలోచించి ముందుకు వెళ్లడం అనేది చెప్పదగినది . ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ప్రమోషన్స్ గాని ఇంక్రిమెంట్ గాని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి . విదేశంలో ఉన్న వారికి ఈ వారం ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు . సాఫ్ట్ వేర్  ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు ఈ  వారం  బాగుందని చెప్పొచ్చు.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . చిన్న విషయానికి ఆందోళన ఎక్కువ అవుతుంది. వివాహం కాని వారికి ఈ వారం వివాహం అయ్యే సూచన కనిపిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది . విదేశీ  వ్యవహారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. స్త్రీలకు ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉందని చెప్పవచ్చు.  ఫైనాన్స్ పరంగా ఈ వారం మీకు బాగుంటుంది.  గ్యాస్ట్రిక్ ఉబ్బసం కడుపు నొప్పి ఇటువంటివి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు . ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ఈ వారం పూర్తవుతాయి .  ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేని  వాతావరణం గోచరిస్తోంది.వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఫైనాన్స్ చేసేవారికి కన్సల్టెన్సీ చార్టెడ్ అకౌంట్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు . విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉంటున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది . వీసా హెచ్ వన్ బి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి . విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం బాగుందనే చెప్పవచ్చు.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.  ఆర్థికంగా బాగుంటుంది.  ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాలి.  జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది.

కన్య:    కన్య రాశి వారికి  ఈ వారం వారికి  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి . భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి . జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ఏ పనైనా ముందుకు వెళ్లడం చెప్పదగినది.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్ కి ,ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు . విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ వారం కుటుంబ  సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు . విహార యాత్రలు దైవ దర్శనాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది . వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుందని చెప్పొచ్చు . వ్యాపార లాభదేదీవులు ఏవైనా  ఉంటే మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగినది . ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి  . ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు కాలం బాగుందని చెప్పవచ్చు .ప్రతి విషయానికి మీకంటూ గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అలాగే వ్యాపారంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది వస్తుంది.

తుల: తులా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు.   ప్రతి పనిలోనూ చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగండి  మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఇంట బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి . వీసా గ్రీన్ కార్డ్ హెచ్ వన్ బి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం శుభ సూచకం అని చెప్పవచ్చు. సాఫ్ట్‌వేర్,  టెక్నికల్ చార్టెడ్  అకౌంట్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు.  ఈ వారం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి . వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని  చెప్పొచ్చు.  సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం సంతానా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయానికి ఆలోచించి భూ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఈ వారం ఆనందంగా గడిపే సూచనలు కనిపిస్తున్నాయి . విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు.

 వృశ్చికం:  వృశ్చికరాశి వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ  లేకపోయినా మానసికంగా అశాంతికి గురి  అవుతారు . ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.  అంతా బాగుంది అని అనుకుంటాం కానీ నరదృష్టి ఎక్కువగా కనిపిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది.  ఈ రాశి వారికి  ఉద్యోగపరంగా ప్రధమార్థం కంటే ద్వితీయార్థం  బాగుందని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి డాక్యుమెంట్ రైటర్స్ కి కళా రంగం వారికి ఈ వారం అనుకూలం అని చెప్పవచ్చు.చార్టెడ్ అకౌంట్స్ టెక్నికల్ ఎలక్ట్రానిక్స్ వారికి ఈ వారం కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఏ పని చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తించగలుగుతాయి . భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కాలం అనుకూలంగా లేదు. సంబంధాల విషయంలో ఆచి తూచి వ్యవహరించండి.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు.  ప్రతి పనిలోనూ మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అప్పు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు .కష్టపడిన దానికి ప్రతిఫలం  లభిస్తుంది.  పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబంతో కలిసి విహార  యాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది. దైవ దర్శనం చేసుకోండి. ఈ నవరాత్రులలో అమ్మవారిని కుబేర కుంకుమతో పూజ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.  వ్యాపారస్తులకు ,మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు , సినిమా రంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలం అని చెప్పొచ్చు . స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి . ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ వస్తుంది లేదా నూతన ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి .

మకరం:   మకర రాశి వారికి  ఈ వారం  అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. చేసిన పని ఒకటికి రెండు సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది .ఎంత కష్టపడిన ఫలితం మటికి తక్కువగానే ఉంటుంది . ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది . చిన్న చిన్న ఉద్యోగం  చేసుకునే వాళ్ళు కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది . విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా లేదు . సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంచెం  గడ్డు కాలం అని చెప్పొచ్చు.  వస్తాయి  అనుకున్న ప్రాజెక్టు రాకపోవడం వల్ల బెంచ్ లో ఉండే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఈ వారం మీకు శుభసూచకంగా కనిపిస్తుంది. ప్రతి విషయానికి ఆలోచించి ముందుకు వెళ్ళండి భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. స్పెక్యులేషన్స్ కి దూరంగా ఉండాలి స్టాక్  మార్కెట్ కి అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పొచ్చు.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ  వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.  ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . బంధువర్గంతో కొన్ని జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు . విదేశంలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  స్కిన్ ,లివర్ ,బ్యాక్ పెయిన్ ,స్పైన్ కి సంబంధించింది ఇబ్బందులు ఏర్పడతాయి వాటి వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. సినీ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు .విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. హెచ్ వన్ బి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలమే అని చెప్పొచ్చు . ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుందని చెప్పొచ్చు.

 ­మీనం: మీనరాశి వారికి ఈ వారం  కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇంటా బయట మీదే  పై చెయ్యి ఉంటుంది. ఏ పని చేసినా సరే నిర్విగ్నంగా సాగుతుంది . అన్నిట్లోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  అనుకున్న పనిని సాధించగలుగుతారు ఉద్యోగస్తులకు  ఉద్యోగపరంగా బాగుందని చెప్పొచ్చు.  మొత్తం మీద ఈ వారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు . ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరచడం చెప్పదగిన విషయం.  బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు.  ఈ వారం ఉద్యోగస్తులకి బాగుందని చెప్పవచ్చు . వ్యాపారస్తులకి ఈ వారం బాగుంది . ఒక రూపాయి ఖర్చు చేస్తే పది రూపాయలు వచ్చే లాభంగా చెప్పవచ్చు . రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం బాగుంది .  సంతోషకరమైన వార్తలు వింటారు . ఈ రాశిలో జన్మించిన  స్త్రీలకు   ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది .విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు . ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది .

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News