Saturday, October 12, 2024

వార ఫలాలు (08-09-2024 నుండి 14-09-2024 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం: మేషరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. విదేశీ ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్, స్టీల్, చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశాల లో చదువుకుంటున్న వారికి కొంత గడ్డుకాలం అని చెప్పవచ్చు వీసా, పాస్పోర్ట్ వంటివి రెన్యువల్స్ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు వున్నాయి. విద్యా అర్హతలు బట్టి కాకుండా వేరే ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఇల్లు కొనాలి అనుకున్న వారికి ఈ వారం బాగుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి విషయానికి స్ట్రెస్ గురికాకుండా ఉండడం చెప్పదగినది. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేసి, 108 సార్లు ఓం నమశ్శివాయ అంటూ నామం జపించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృషభం: వృషభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి ఆచితూచి ముందుకు వెళ్లడం చెప్పదగినది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు వారం బాగుంది అని చెప్పవచ్చు. కెరియర్ పరంగా ఒక దిగులు ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. విదేశాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వ పరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బావుంది. భాగస్వాముల్లో కొంత లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార విస్తరణకు ఈవారం అనుకూలం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా యూఎస్ గాని యూకే గాని వెళ్లాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లోన్లు మంజూరు అవుతాయి విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు మెరుగ్గా ఉన్నాయి అని చెప్పవచ్చు. నూతన గృహం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ వారం బాగుంది. సుబ్రమణ్య కంకణం ధరించడం చెప్పదగిన సూచన.

మిథునం: మిథున రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగం మారాలి అన్న మీ కల నెరవేరుతుంది. సంతాన పరంగా ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. వివాహ సంబంధాలను చూడడం ప్రారంభిస్తారు. ఇల్లు నిర్మాణం కోసం లోన్ అప్లై చేస్తారు. ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. వ్యాపారంలో రొటేషన్ బాగుంటాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది.భాగస్వామ్య వ్యాపారాలకు కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా బాగుందని చెప్పవచ్చు . వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తున్నది. ఆరోగ్య విషయాలు బాగున్నాయి. వీసా పాస్పోర్ట్ వంటివి అనుకూలిస్తాయి.ఈ రాశి వారు సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం, అలాగే సుబ్రమణ్య అష్టకం పఠించడం చెప్పదగినది.

కర్కాటకం : కర్కాటకరాశి వారికి ఈ వారం అనుకూలించే ఫలితాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా గాని, పాస్పోర్ట్ గాని, అప్లై చేసేవారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పు కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్ రంగం వారికి, సినీ కళా రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచన కనిపిస్తోంది. లాభాలు పెట్టుబడి రూపంలో బాగుంటాయి.
రియల్ ఎస్టేట్, స్టీల్, కన్సల్టెన్సీ లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది.
విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. ఆరోగ్య రీత్యా జాగర్తలు
తీసుకోవాలి. వీసా, హెచ్ వన్- బి కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంన్నది. ఈ రాశి వారు శివాలయంలో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవ రూపు మేడలో ధరించండి.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. చేపట్టిన పనులు అన్నిటిలో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఆదాయం బాగుంటుంది. పిల్లలు చదువు కోసం ఫిక్సెడ్ డిపాజిట్లలో చేస్తారు. వ్యాపార పరంగా అనుకూలత ఉంది. భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న ఒడుదుడుకులు వస్తాయి. అకౌంట్స్ పరంగా అన్ని చూసుకుని వెళ్లడం చెప్పదగినది. విద్యార్థిని విద్యార్థులకు రావాల్సిన మెరిట్ మార్కులు తగ్గుతాయి. ఎడ్యుకేషన్లో కాస్త స్ట్రెస్ కి గురవుతారు. కష్టపడి చదువుతున్నా ఫలితం అంత అంత మాత్రం వస్తుందని బాధపడతారు. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు అవసరం. గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, స్కిన్ ఎలర్జీ, ఉబ్బసం వంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించుకోవడం వల్ల కొంత మానసిక ధైర్యం ఏర్పడుతుంది.

కన్య: కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లోన్లు విషయంలో జాగ్రత్తగాఉండాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఎక్కువ శ్రమ కనిపిస్తోంది. ఫైనాన్స్ విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు సూచిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు అనుకూలపడతాయి. స్త్రీలకు సంబంధించి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి. స్కిన్ ఎలర్జీ, గ్యాస్ట్రిక్, గైనిక్ సంబంధించిన ఇబ్బందులు పెట్టవచ్చు. ఈ రాశి వారు విష్ణు ఆలయ దర్శనం మేలు చేకూరుతుంది. శక్తి రూపు గాని, శక్తి కంకణం గాని ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి.

తుల: తులా రాశి వారికి స్త్రీ పురుషులకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు రొటేషన్ బాగున్నా, ధనం మాత్రం కనిపించదు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ కి, కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు, మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి ఈవారం బాగుందని చెప్పవచ్చు.
ఈ గణపతి నవరాత్రుల్లో ఇల్లు కొనాలని, లేదా స్థలాన్ని శంకుస్థాపన చేయాలని అనుకుంటారు. ప్రతిరోజు గణపతికి అష్టోత్తరంతో పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఫైనాన్స్ పరంగా అనుకూలంగా ఉంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ చేయాలనే కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్నవారికి H1Bఈ వారం వచ్చే అవకాశం
గోచరిస్తుంది.ఈ రాశి వారు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం లేదా శుక్రవారం నాడు కుంకుమార్చన చేయించండి..

వృశ్చికం: వృశ్చికరాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తునందు వలన పనులు నిదానంగా సాగుతాయి. బంధు మిత్రులతో విరోధం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ప్రతి విషయాన్ని ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని కోరుకుంటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ఆఫీసులో సహా ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్య పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, చెప్పుకోదగ్గ స్థాయి ఏమి ఉండదు.విద్యార్థిని విద్యార్థులకు కాలం బాగుందని చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. వివాహానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఆంజనేయస్వామి వారికి పూజ చేయడం చెప్పదగినది. కాలభైరవ రూపు మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి.

ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం ఉద్యోగ పరంగా బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటుచేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. నూతన గృహం కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది. ఈ వారం విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. వ్యాపారస్తులకు బాగుందని చెప్పవచ్చు. చార్టెడ్ అకౌంట్, సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ సెక్టార్, ఐరన్ బిజినెస్, ఎగుమతి దిగుమతి, కూరగాయల వ్యాపారస్తులకు,చిరుధాన్యాల వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు చేకూర్చే అంశంగా చెప్పవచ్చు. నూతన పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చి పెడతాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్ధిక పరంగా బాగుందని చెప్పవచ్చు. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేయండి. స్త్రీలకు ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ పరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు గురువారం నాడు మేధా దక్షిణామూర్తికి పూజాధి అభిషేకాలు చేయడం, అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మకరం: మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో, ఉద్యోగులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ఇల్లు కొనేటప్పుడు డాక్యుమెంట్ సరిగ్గా చూసుకోండి. వస్త్ర వ్యాపారస్తులకు, జువెలరీ వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్, నిత్యవసరాల వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత బాగా లేదని చెప్పవచ్చు.ఫైనాన్స్ వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి. వివాహానికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ప్రేమ వివాహ విషయంలో మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంది. వృత్తి , ఉద్యోగాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నచిన్న విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు శని స్తోత్రం పఠించడం, శనీశ్వరునికి 8 శనివారాలు తైలాభిషేకం చేయడం మంచిదని చెప్పదగినది సూచన.

కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్న వారికి బాగుందని చెప్పవచ్చు. వీసా, హెచ్.1.బి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. విదేశీ వ్యాపారాలు అనుకూలిస్తాయి. కార్ లోన్, హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా లాభదాయకం అని చెప్పవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

మీనం: మీనరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన గృహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్య రీత్యా జాగ్రతలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కాలం బాగుందని చెప్పవచ్చు. మీ కృషి పట్టుదల వల్ల నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు . భూమి అమ్మాలన్న కొనాలన్న డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినది. పిల్లల విద్య పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తారు. వివాహం కాని వారికి వివాహం ఆలస్యమైయ్యే అవకాశం గోచరిస్తోంది. దైవానుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. విద్యార్థులు కష్టపడాల్సిన కాలం అని చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News