ముంబై: గృహ వస్త్రాలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ వెల్‌స్పన్ వరల్డ్‌లో భాగమైన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ (డబ్ల్యుఎల్ఎల్) నేడు తమ తాజా ప్రచారం ‘క్యుంకి ఫర్క్ పడ్తా హై’ని ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ప్రచారంలో భాగంగా బ్రాండ్ రెండు చిత్రాలను విడుదల చేసింది. సుప్రసిద్ధ నటి విద్యా బాలన్ నటించిన ఈ రెండు చిత్రాలూ ఇంటిపై ధ్యాస, హాస్యం మిళితం చేసి హారర్ కామెడీ తీరులో నాణ్యమైన హోమ్ లినెన్ నిజంగా ఎందుకు ముఖ్యమో చెబుతాయి.
‘ఒకే పరిమాణం, అందరికీ సరిపోతుంది’ అనే తీరుతో కూడిన మార్కెట్‌లో, వెల్‌స్పన్ కొత్త ప్రచారం, ఉత్పత్తి నాణ్యత ఖచ్చితంగా తేడాను చూపుతుందనే సాధారణ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించటం లక్ష్యంగా పెట్టుకుంది. ‘చౌకైన’ లేదా బ్రాండెడ్ కాని ఉత్పత్తులను ఎంచుకునే సాధారణ అలవాట్లను ఆధారంగా చేసుకుని, ఈ చిత్రం ‘క్యుంకి ఫర్క్ పడ్తా హై’ (ఎందుకంటే అది మార్పు తీసుకువస్తుంది ‘) అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించి స్క్రిప్ట్‌ను సరదాగా మార్చివేసింది, సరైన ఎంపిక ప్రతిదీ మార్చగలదని వినియోగదారులకు గుర్తు చేస్తుంది.
Atom నెట్‌వర్క్ నేపధ్యీకరించిన ఈ ప్రచార లఘు చిత్రాలలో వెల్‌స్పన్ యొక్క క్విక్‌డ్రై® టవల్స్ మరియు ప్యూర్‌కోట్ బెడ్‌షీట్‌లు ప్రదర్శిస్తున్నారు. ప్రతి చిత్రమూ దాని స్వంత కథాంశం కలిగి ఉంటుంది, కానీ రెండూ ఆహ్లాదకరమైన రీతిలో అతీంద్రియ మలుపును అనుసరిస్తాయి, ఊహించని “దెయ్యం” జోక్యం, పాత్రలను (మరియు వీక్షకులను) మెరుగైన ఎంపికల వైపు నడిపిస్తుంది. పంచ్ డైలాగ్‌లు, సినిమాటిక్ విజువల్స్ , విద్య యొక్క ప్రత్యేక ఆకర్షణతో : మీ చర్మాన్ని తాకేది , మీరు మీ ఇంటికి తీసుకువచ్చే దాని విషయానికి వస్తే, నాణ్యత ఎల్లప్పుడూ తేడాను కలిగిస్తుంది- అనే సందేశం స్పష్టంగా వినిపిస్తాయి.
ఈ ప్రచారం గురించి వెల్‌స్పన్ లివింగ్ ఎండి & సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ, “మన ఇళ్లలోకి మనం తీసుకువచ్చేది కేవలం వాడుక గురించి కాదని, ఇది నమ్మకం, శ్రద్ధ, ఎక్కువకాలం మన అవసరాలను తీర్చదగిన రీతిలో ఉండేందుకు అని ప్రతి గృహిణికి తెలుసు. ప్రతి కొనుగోలు ఆలోచనాత్మకంగా ఉంటుంది, నాణ్యత అనేది మనకు మనశ్శాంతిని ఇస్తుంది. ‘క్యుంకి ఫర్క్ పడ్తా హై’ అనే ఈ ప్రచారం ద్వారా నాణ్యతలో కొద్ది పాటి తేడాలు కూడా రోజువారీ జీవితంలో పెద్ద మార్పును కలిగిస్తాయని మాదైన రీతిలో చెబుతున్నాము. ఈ తేడా సౌకర్యం, మన్నిక లేదా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు గర్వంతో కూడిన భావన కావచ్చు. ఈ ప్రచారంతో మేము కేవలం ఉత్పత్తుల గురించి మాట్లాడటం కంటే కూడా మహిళలు ప్రతిరోజూ తమ ఇళ్లను ఆత్మీయంగా, స్వాగతించే , శాశ్వతంగా ఉంచడానికి చేసే ఎంపికలను వేడుక చేసుకోవాలని మేము కోరుకున్నాము. భారతీయ గృహిణి యొక్క బలం, ఆకర్షతను ప్రతిబింబించే విద్య, శ్రద్ద, శాశ్వతత్వం , ప్రామాణికత యొక్క ఈ కథను చెప్పడానికి మాకు సరైన స్వరంగా నిలిచారు ” అని అన్నారు.
నటి విద్యా బాలన్ మాట్లాడుతూ.. “ ‘క్యా ఫర్క్ పడ్తా హై’ అని చాలా సార్లు నేను విన్నాను. ఈ చిత్రంలో చెప్పినట్లుగా, ప్రతిసారీ నేను చెప్పాలనుకున్నది , అవును, ఖచ్చితంగా ఫర్క్ పడ్తా హై!. సాధారణ , మెరుగైన, యాదృచ్ఛిక మరియు ఆధారపడతగిన అంశాల మధ్య తేడా ఉంటుంది. ఆ సత్యాన్ని, కొంత నాటకీయత, కొంత హాస్యం, వాస్తవికతతో సజీవంగా తీసుకురావడం నాకు చాలా సంతోషంగా వుంది” అని అన్నారు.
atom నెట్‌వర్క్ సహవ్యవస్థాపకుడు & చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ యష్ కులశ్రేష్ఠ మాట్లాడుతూ “రోజువారీ ఇంటిలోపల వాడే వస్త్రాల కోసం బ్రాండ్ ఉత్పత్తులను ఎంచుకోవాల్సిన అవసరం లేదనే నిజమైన వినియోగదారు అలవాటును తీసుకున్నాము. ఆ భావనకు సాంస్కృతిక రుచి మరియు విద్య స్క్రీన్ పై కనిపించటంతో కొంత నాటకీయతను జోడించాము. ఇది కేవలం అవగాహనను మెరుగుపరచటానికి మాత్రమే కాకుండా, ప్రాధాన్యతలను సైతం మార్చడానికి రూపొందించబడిన కథనం ” అని అన్నారు.
ఈ ప్రచారం ఇప్పుడు టీవీ, డిజిటల్, ప్రింట్, అవుట్‌డోర్ , సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. పట్టణ మరియు సెమీ-అర్బన్ భారతదేశంలోని లక్షలాది గృహాలను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రోజువారీ జీవితాన్ని పనితీరు, అనుభూతి పరంగా మెరుగుపరిచే ఉత్పత్తులను సృష్టించడం అనే వెల్‌స్పన్ యొక్క పెద్ద లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.
‘క్యుంకి ఫర్క్ పడ్తా హై తో, వెల్‌స్పన్ తమ ఉత్పత్తులను ప్రత్యేకంగా ఏ అంశం నిలుపుతుందనేది ప్రజలకు చెప్పడమే కాదు, వారిని నవ్విస్తూనే ఆ తేడాను అనుభూతి చెందేలా చేస్తుంది.