Monday, April 29, 2024

చర్మ సౌందర్య శస్త్రచికిత్సలకు పెద్ద ఎత్తున ఆదరణ

- Advertisement -
- Advertisement -

సినీతారల నుంచి సామాన్య ప్రజల వరకు చికిత్సలకు మొగ్గు
డెర్మోటో సర్జరీ సదస్సులో వైద్య నిపుణులు వెల్లడి

హైదరాబాద్ : చర్మ సౌందర్య శస్త్రచికిత్సలు ఈ మధ్య కాలంలో బాగా ఆదరణ పొందుతున్నట్లు, సినీతారల నుండి సామాన్య ప్రజల వరకు ఈ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారని కిమ్స్ ఆసుపత్రి ఎండీ, చైర్మన్ బొల్లినేని బాస్కర్‌రావు పేర్కొన్నారు. టీఎస్‌ఐఏడీవీఎల్, కిమ్స్ డెర్మటాలజీ విభాగం కలిసి సంయుక్తంగా డెర్మోటో సర్జరీ సదస్సును ఆదివారం నిర్వహించాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శస్త్రచికిత్సలో వస్తున్న అధునాతన పద్దతులపై వైద్యులకు అవగాహగాన ఉండాలని సూచించారు. ఇలాంటి సదస్సులు డాక్టర్లకు ఎంతో దోహదం చేస్తాయని వ్యాఖ్యనించారు. దీని ద్వారా సమగ్ర శస్త్రచికిత్స నైపుణ్యం పెరుగుతుందన్నారు.

ఈసదస్సుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది డెర్మటాలజిస్టులు పాల్గొని చర్మ వ్యాధుల, శస్తచికిత్సల గురించి వివరించారు. అనంతరం డాక్టర్. ఆనందర్ కుమార్ వగ్గు ప్రసంగిస్తూ మొదటిసారిగా ఇక్కడ లైవ్ లో చర్మ సౌందర్యానికి సంబంధించిన శస్తచికిత్సను చేశామని తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఎంతో మంది వైద్యులకు ఇది చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వెటిలిగో సర్జరీ, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్, అకినెల్కార్ సర్జరీ, నెయిల్ సర్జరీలు లైవ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏడివిఎల్ అధ్యక్షుడు డా. అనూప్ కుమార్ లహరి, సెక్రటరీ డా. ఇందిరా, ఎస్‌ఐజి కన్వీనర్ డా. నితిన్ జైన్, కో-ఆర్డినేటర్ డా. యోగోష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News