Wednesday, September 17, 2025

పలుప్రాజెక్టులకు వన్యప్రాణి బోర్డు అనుమతులు

- Advertisement -
- Advertisement -

కడెం ప్రాజెక్టుపై లక్ష్మీపూర్ ఎత్తిపోతలు, రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ప్రతిపాదనలకు ఆమోదం

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర వన్యప్రాణి బోర్డు సమావేశంలో తెలంగాణకు సంబంధించి పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న 23 అభివృద్ది పనులను ఈ మేరకు చర్చించి అనుమతి ఇచ్చారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుపై నిర్మించ తలపెట్టిన లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ (ఖానాపూర్ పరిధి) పథకానికి బోర్డు అనుమతులను ఇచ్చింది. సాగునీటి శాఖ ప్రతిపాదనలను అటవీ శాఖ నిబంధనల మేరకు కేంద్ర వన్యప్రాణిబోర్డు ద్వారా అనుమతులు సాధించింది.

Also Read: రేవంత్ చరిత్ర హీనుడు: శ్రవణ్

3.17 హెక్టార్ల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమావేశానికి హాజరైన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్, హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు.దీంతో పాటు తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ, వెడల్పుకు సంబంధించిన 11 ప్రతిపాదనలకు, ఐదు పంచాయితీ రాజ్ రోడ్లకు, కుమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్‌లో విద్యుత్ లైన్ ప్రతిపాదనకు కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News