Monday, May 6, 2024

కమిషన్ తీసుకున్నట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి రిటైర్ అవుతా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : తాను ఏ ఒక్కరి నుంచైనా కమిషన్ తీసుకున్నట్టు రుజువు చేస్తే రాజకీయాల నుండి రిటైర్ అవుతానని కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్ స్పష్టం చేశారు. మాజీ సిఎం బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి అశోక్ ఆరోపణలను ఉద్దేశిస్తూ ఈ ఆరోపణలు అబద్ధమని రుజువైతే వారిద్దరూ రాజీనామా చేస్తారా ? అని ఎదురు ప్రశ్న వేశారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) చేపట్టిన పనులు అన్నిటి పైనా దర్యాప్తు జరుగుతోందని ఏదో ఒక డిపార్టు మెంట్‌కే పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. ఈలోగా బొమ్మై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. కాంట్రాక్టర్ల అసోసియేషన్ గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారని,

రాహుల్ గాంధీకి కూడా ట్వీట్ చేశారని, వారు తమను కూడా కలుసుకున్నారని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగడం లేదని, దీనికి కారణమేమిటో దర్యాప్తు చేయాలని కోరుతున్నారని అన్నారు. దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం అవసరం. కానీ గత ఆరునెలలుగా పనిచేసిన అసలుసిసలైన వారికి చెల్లింపులు లేవని బొమ్మై పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఏప్రిల్‌లో రూ. 650 కోట్లు విడుదల చేశానని చెప్పారు. బిబిఎంపి వసూలు చేసిన ఆస్తి పను మొత్తాల నుంచి నిజాయితీగా పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగేలా చూడాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News