Tuesday, April 30, 2024

ఆ లింక్ క్లిక్ చేస్తే రూ. 2 లక్షలు పోయాయి: కీర్తిభట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతా డిజిటల్ మయం అవుతుండడంతో పాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు, సెలెబ్రిటీలు కూడా మోసపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కీర్తిభట్ కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. కొరియర్ కోసం ఒక లింక్ క్లిక్ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుంది. ఈ విషయమై యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో కూడా పెట్టింది.

తనకొక కొరియర్ రావాల్సి ఉండగా, అది వారం రోజులయినా రాకపోయేసరికి కొరియర్ సెంటర్ వారికి కాల్ చేసింది. వాళ్లు డెలివరీ చేశా…మెహదీపట్నంలో ఉందన్నారు. వాళ్లు హిందీలో మాట్లాడి లొకేషన్, అడ్రస్ ఫార్వర్డ్ చేయమని కోరారు. అది అప్డేట్ కావడం లేదంటూ వాట్సాప్ ద్వారా అడ్రస్ పంపించమన్నారు. ఆ తర్వాత హాయ్ అని మెసేజ్ పెట్టారు.

అప్డేట్ కి రూ. 2 పంపమన్నారు. అంతేకదా అని సరేనంది. దాంతో యూపిఐ నెంబర్ అడిగితే ఆమె ఇవ్వలేదు. తర్వాత బ్యాంక్ లింక్ నెంబర్ ఇదేనా అని అడిగి తీసుకున్నారు. తర్వాత ఆమెకి ప్రాసెసింగ్ మెసేజ్ వచ్చింది. వాళ్లు అప్డేట్ చేస్తాం అని ఫోన్ కట్ చేశాక అకౌంట్ నుంచి రెండు రూపాయాలు కట్ అయ్యాయి. రెండు రూపాయలే కదా అని ఆమె పట్టించుకోలేదు. తర్వాత షూటింగ్ కు వెళ్లిపోయింది.

సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు రూ. 99 వేలు బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే మరో రూ. 99 వేలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే రూ. 2 లక్షలు బదిలీ ఏయినట్లు చూపింది. తర్వాత సైబర్ కాంప్లెయింట్ ఇచ్చి…అకౌంట్ ను బ్లాక్ చేయించారు. సైబర్ క్రైమ్ వారు కంప్లెంయింట్ తీసుకుని ట్రాకింగ్ మొదలెట్టారు.

తన డబ్బులు ఇంకా తిరిగి రాలేదని, కానీ కచ్చితంగా తిరిగి వస్తాయని పోలీసులు హామీ ఇస్తున్నట్లు కీర్తి భట్ తెలిపింది. సైబర్ క్రైయిమ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలని కీర్తిభట్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News