Thursday, October 10, 2024

పసుపు ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్టు

- Advertisement -
- Advertisement -

పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుండడంతో స్మగ్లర్లు కొత్తదారుల్లో విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు చాక్లెట్‌లో గంజాయి కలపి విక్రయించడం చూశాం, ఇప్పుడు ఏకంగా ఎవరికి అనుమానం రాకుండా పసుపు ప్యాకెట్లలో గంజాయి నింపి అమ్ముతున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేయడంతో ఈ విషయం బయటపడింది. ధూల్‌పేటకు చెందిన నేహాభాయ్ పసుపు ప్యాకెట్లలో గంజాయి నింపి విక్రయిస్తోంది. ఈ విషయం ఎక్సైజ్ సిబ్బందికి తెలియడంతో దాడి చేసిపట్టుకున్నారు. పది గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే నేహాభాయ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిఎస్పి తిరుపతి యాదవ్, ఎస్సై నాగరాజు, సిబ్బంది దాడులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News