Wednesday, November 13, 2024

మంత్రాల నెపంతో మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మంత్రాలు చేస్తున్నారంటూ ఒక మహిళను కొట్టి చంపిన ఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరల్లోకి వెళితే….మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన డ్యాగల ముత్తవ్వ అనే 50 సంవత్సరాల మహిళ మంత్రాలు చేస్తున్నారని, కోపంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గత గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంట్లో ఉన్న మహిళను బయటకు ఈడుచుకు వచ్చి తలపై దాడి చేయడంతో కుప్పకూలింది. దీంతో పెట్రోల్ తీసుకువచ్చి ముత్తవ్వ ఒంటిపై పోసి నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన ఒక బాలుడు అనారోగ్యానికి

గురికాగా ముత్తవ్వ మంత్రాల నేపథ్యంలోనే బాలుడు అనారోగ్యానికి గురయ్యారని ఆరోపిస్తూ మహిళపై అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న ముత్తవ్వను రామాయంపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ముత్తవ్వ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా sp ఉదయ్ కుమార్ రెడ్డి పహారా పర్యవేక్షిస్తున్నారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News