Sunday, May 4, 2025

బిర్యాని తిని భార్య మృతి.. భర్తకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫుడ్‌ పాయిజన్‌తో భార్య చనిపోయి.. భర్త అనారోగ్యం పాలైన ఘటన బాలా నగర్‌లో చోటు చేసుకుంది. బిర్యానీ తిని తన సొదరి చనిపోయిందని.. రాజేంద్రనగర్ పిఎస్‌లో మృతురాలి సోదరి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రబోడ ప్రాంతానికి చెందిన రమేశ్(48), రాజేశ్వరి(38) దంపతులు. బాలా నగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో రమేశ్ పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం బాలానగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీ తీసుకొచ్చి.. అదే రాత్రి భార్యతో కలిసి ఆ బిర్యాని తిని పడుతకకున్నారు.

తెల్లవారుజాము నుంచే వాంతులు, విరోచనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అయినా ఫళితం లేకుండా పోయింది. గురువారం రాజేశ్వరి మృతి చెందగా.. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ అనారోగ్యంతో ఉప్పరపల్లిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫుడ్ పాయిజన్‌తో తన సోదరి మృతి చెందిందని రాజేశ్వరి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News