Wednesday, September 17, 2025

వడదెబ్బతో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

సంగెం: వడదెబ్బతో మహిళ మృతిచెందిన సంఘటన సంగెం మండలంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన పాపని ప్రియాంక(28) రోజు మాదిరిగానే మంగళవారం కూలీ పనులకు వెళ్లగా తీవ్రమైన ఎండ తాపం కారణంగా అస్వస్థతకు గురై, వడదెబ్బతో సొమ్ముసిల్లి పడిపోయింది.

దీంతో ప్రియాంకకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే తోటి కూలీలు గమనించి కుటుంబసభ్యులకు తెలియపర్చగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. స్వగ్రామంలో ఆమె భౌతికాయాన్ని సర్పంచ్ దొనికెల రమ శ్రీనివాస్ సందర్శించి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ నివాళులర్పించి మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. మృతురాలికి భర్త, 13 నెలల పాప ఉన్నారు. చిన్న పాపను చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్శనలో ఉపసర్పంచ్ చెన్నూరి యాకయ్య, వార్డుసభ్యులు, తెలంగాణ వైఎస్సార్ మండలాధ్యక్షుడు గూళ్లపల్లి సురేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News