Tuesday, December 10, 2024

సూర్యాపేటలో కారు బీభత్సం.. మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. మంగళవారం మునగాల మండలం మాధవరం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి.. పాదచారులు, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి క్షతగాత్రుల తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News