Wednesday, October 9, 2024

పిడుగు పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

పిడుగుపడి మహిళ మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, మమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలమ్మ, నాగేంద్రమ్మ అక్కాచెల్లెళ్లు. ఆదివారం పశువులను మేపుతుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వచ్చిన భారీ వర్షంతో చెట్టు కిందకు చేరారు. ఆ సమయంలో పిడుగుపడి చెల్లెలు నీలమ్మ (39) అక్కడికక్కడే మృతి చెందింది. నాగేంద్రమ్మ స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News