Saturday, October 5, 2024

ఉజ్జయిన్‌లో వెలుగుచూసిన దారుణం

- Advertisement -
- Advertisement -

వీధుల్లో చెత్త ఏరుకునే ఒక మహిళపై జరిగిన అత్యాచారాన్ని వీడియో చిత్రీకరించిన ముగ్గురు నుంచి నులుగురు అనుమానితులను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఒక అధికారి శుక్రవారం తెలిపారు. ఉజ్జయిన్‌లోని అగర్ నాకా ప్రాంతంలో చెత్త ఏరుకునే ఒక మహిళకు మద్యం తాడించి ఆమెపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారం జరుగుతుండగా చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన ముగ్గురు నుంచి నలుగురు అనుమానిసుతలను గుర్తించామని, నగరంలోని వేర్వేరు ప్రదేశాల్లో నివసించే ఈ వ్యక్తులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామనిత్వాల్ ప్రాంత ఎస్‌పి ఓం ప్రకాశ్ మిశ్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News