Tuesday, May 20, 2025

బెంగళూరులో భారీ వర్షాలు.. ఇల్లు గోడ కూలి మహిళ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరులో భారీ వర్షాల దశలో ఓ ఇల్లు గోడ కూలిన ఘటనలో ఓ 35 ఏండ్ల మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటనపై ప్రతిపక్షం బిజెపి స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రక్షించలేకపోతోందని విమర్శించారు. అయితే ఈ వాదనను ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తిప్పికొట్టారు. ఐటి రాజధానిలో వరదల పరిస్థితి కొత్తదేమీ కాదని, బిజెపి హయాంలో జరిగిన అవినీతి వరదను చక్కదిద్దడానికే తాము కాలం వెచ్చించాల్సి వస్తోందని ఎదురుదాడికి దిగారు. దీర్ఘకాలిక పరిష్కారాల కోసం చూస్తున్నామని, బిజెపి వరద బురద రాజకీయాలు కుదరవని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వరదల నివారణకు కోట్లు పెడుతున్నట్లు లెక్కల్లో చూపుతోందని, అయితే ఫలితం దారుణం అని, ఇప్పుడు బెంగళూరు రోడ్లు స్థితి చూస్తే కథ తెలుస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ,

మల్లేశ్వరం ఎమ్మెల్యే సిఎన్ అశ్వథ్‌నారామణ శివకుమార్‌పై విరుచుకు పడ్డారు. బెంగళూరు రోడ్ల మెరుగు , మౌలిక వసతుల కోసం గత రెండేళ్లలో ఏ మేరకు ఖర్చు పెట్టారో శ్వేత పత్రం ఇస్తారా? అని కర్నాటక బిజెపి నేత , కర్కాలా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కర్కాలా సవాలు విసిరారు. ఓ పత్రం విడుదల అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి లెక్కాపత్రం ప్రజలకు తెలుస్తుందన్నారు. బెంగళూరు ఐటి రాజధాని అంటారు. దేశ విదేశాల నుంచి నిత్యం జనం వచ్చివెళ్లుతుంటారు. పైగా బెంగళూరు నుంచే అత్యధిక వాటాలో పన్నులు ఖజనాకు చేరుతాయి. మరి ఆయువుపట్టు వంటి బెంగళూరు అప్పటి బిజెపి ఇప్పటి కాంగ్రెస్ అధికార హయాంలో నానాటికి తీసికట్టు అయిందని పౌరులు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News