Thursday, February 9, 2023

విశాఖలో మహిళను ముక్కలు ముక్కలుగా నరికి… డ్రమ్ములో పడేసి

- Advertisement -

 

అమరావతి: శ్రద్ధవాకర్‌లాగానే ఓ మహిళను హత్య చేసి ముక్కలుగా నరికి ప్యాకింగ్ చేసి డ్రమ్ములో భద్రపరిచిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మన్యం జిల్లా సీతంపేట ప్రాంతం పార్వతీపురం గ్రామానికి చెందిన రుషి(40) విశాఖలో ఓ ఇంట్లో అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఇంటి యజమాని రుషిని ఖాళీ చేయాలని పలుమార్లు చెప్పాడు. యజమాని ఇంటికి వచ్చి పరిశీలిస్తుండగా డ్రమ్ములో నుంచి వాసనరావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళ శరీర భాగాలుగా గుర్తించారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా అని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రుషికి-మృతురాలికి మధ్య గతంలో ఆర్థక లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. లావాదేవీల విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. మహిళకు నిందితుడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles