Monday, March 17, 2025

విమానంలో మహిళ వికృత చేష్టలు.. దుస్తులు విప్పి..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: విమానంలో ఓ మహిళ చేసిన వికృత చేష్టలు.. తోటి ప్రమాణికుల్ని భయభ్రాంతులకు గురి చేసిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ విమాసంలో చోటు చేసుకుంది. అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ మహిళ బిగ్గరగా కేకలు వేస్తూ.. దుస్తులు తొలగించడం ప్రారంభించింది. పెద్దగా అరుస్తూ.. అటూ ఇటూ పెరిగెత్తింది. కాక్‌పిట్ తలుపును దబాదబా బాదుతూ.. తనను దించేయాలని అరిచింది. సుమారు 25 నిమిషాల పాటు ఈ తతంగం జరిగింది.

దీంతో పైలెట్లు ఫైట్‌ని వెనక్కి మళ్లించారు. సదరు మహిళ ఒంటిపై దుప్పటి కప్పి.. హ్యూస్టన్ పోలీసులకు అప్పగించారు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమెను మానసిక వైద్య కేంద్రనికి పంపించారు. ఇప్పటికైతే.. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు అని పోలీసులు తెలిపారు. ఈ గందరగోళం కారణంగా విమానం గమ్యస్థానానికి చేరుకోవడానికి 90 నిమిషాలు ఆలస్యమైంది. అందువల్ల ప్రయాణికులకు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News