Saturday, October 12, 2024

బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: 2023-24 బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని బిఆర్‌ఎస్ జిల్లా మహిళా నాయకురాలు బూర విజయ అన్నారు. శనివారం సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరుస్తూ మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. బడ్జెట్‌లో మహిళలకు పెద్ద పీట వేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. రాష్ట్రం పురోబివృద్దిలో మరింత అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామోజీల నిర్మల, సువర్ణలక్ష్మి, అనితరెడ్డి, అర్చనరెడ్డి, తార తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News