Monday, April 29, 2024

World Cup 2023: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. శతకం వైపు డికాక్

- Advertisement -
- Advertisement -

లక్నో: వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకనా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సఫారీ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు డికాక్, తెంబా బవుమాలు తొలి వికెట్ కు 108 పరుగుల శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో డికాక్ అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన తెంబా బవుమా(35) ఔటయ్యాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన డస్సెన్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుండగా, డికాక్ మాత్రం గేర్ మార్చి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(82), డస్సెన్(08)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News