Thursday, May 9, 2024

వనితా… నీకు వందనం

- Advertisement -
- Advertisement -

World womens day Celebrations

మన తెలంగాణ /సిటీ బ్యూరో: సమాజంలో సగ భా గంగా ఉన్న మహిళ అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ప్రతి వ్యక్తి విజయంలో కీలక పాత్ర పోషిస్తొంది. ఓచేతి తో ఇంటిని, మరోచేతితో పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తునే తన హక్కుల పరిరక్షణకు నినదిస్తోంది.. నాడు వంటింటికే పరిమితమైన మహిళా నేడు అన్ని రం గాల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ మగవాళ్లుకు దీటుగా కుటుంబానికి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు మన తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో తమ విజయ పరంపర కొనసాగిస్తూ ముందకు సాగుతున్న పలువురు మహిళ ప్రముఖుల అభిప్రాయాలను మీ కోసం అందిస్తోంది.

తెలంగాణలోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు : గద్వాల్ విజయలక్ష్మి, (జిహెచ్‌ఎంసి మేయర్)

Mayor Gadwal Vijayalakshmi wishes Happy New Year

గ్రామ పంచాయతీ స్థాయి నుంచి గ్రే టర్ హైదరాబాద్ వరకు స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే. మహిళల పు రోగాభివృద్ధ్ది లక్షంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకం లేదు. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి మహిళా ఆర్ధికంగా నిలదొక్కుంటూ ఆత్మ విశ్వాసంతో ఉండాలని ఆ కాంక్షింస్తున్నా. మహిళలంటే సహానానికి మారు పేరు. ఇం టిపనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు, ఇంకో వైపు కుటుంబ బాధ్యతలు ఇలా మహిళలు అనేక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని రంగాల్లో నేటి మహిళలు ముందుకు దూసుకువెళ్లుతుండడం మహిళ లోకానికే గర్వకారణం. తన తోటి మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.

పురుషాధిపత్య మనస్తత్వమే మహిళ వివక్షకు మూలం : డాక్టర్ ప్రతిభా లక్ష్మి( ఉస్మానియా)

International Women's Day Celebration

అంతర్జాతీయ శుభ సందర్బంగా మమహి ళా లోకానికి శుభాకాంక్ష లు. మనలో తరతరాలుగా ఇమిడిపోయిన ఈపురుషాధిపత్య మనస్తత్వం కారణ ంగా తెలియకుండానే ఆడవారిని తక్కువ చేసి చూడడానికి అలవాటు పడ్డాం. కానీ మహిళాభివృద్దితోనే దేశాభివృద్ధి సాధ్యమని అర్ధం చేసుకోవాలి. మహిళలకు స మాన వేతనం, సమాన ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే వివక్షలేని సమానత్వం సాధ్యమవుతుంది. సరైన విద్య, ఆరోగ్యం లభించి, మహిళలు ఆర్ధికంగా స్వతంత్రులు అవ్వగలిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది. నా వంతుగా వీ ఫర్ ఉమెన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాను.

మహిళలకు అవకాశాలు కల్పించడంలో మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి : వి.మమత (కూకట్‌పల్లి జోనల్ కమిషనర్)

women's day 2019

మహిళలు అన్ని రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నా ఇప్పటీకి పలు సంస్థలు వారికీ కీలక బాధ్యతలను అప్పగించాల్సి వచ్చే సరికి వివక్షత ను చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు మొదలు అన్ని రంగాల్లో మ హిళలకు సమాన అవకాశా లు కల్పించాల్సిన అం శంలో మాటాల్లో రాకుండా చేతల్లో చూపినప్పుడే మహిళా సాధికారిత సాధ్యం కావడమే కాకుండా సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్ష సమిసిపోతుంది. ఈ అంశాన్ని ఆకాంక్షిస్తూ ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్య రాజ్య సమితి తీసుకున్న “జెండర్ ఇక్వాలిటీ ” థీమ్‌ను సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ మహిళలందరీకీ శుభాకాంక్షలు.

మహిళా అభివృద్ధ్ది ప్రభుత్వం ఎనలేని కృషి : మోతే శ్రీలత (జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్)

మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు … మహిళల అభివృద్దికి ప్రభుత్వం ఎనలేని కృషి చే స్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాల యం ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడం మ హిళా సాధికారితకు చేస్తున్న కృషికి నిదర్శనం. అంతేకాకుండా మహిళల ఆర్ధిక స్వా లంబనే ధ్యేయంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం రూపకల్పన చేస్తూ అమలు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మహిళా సాధికారితలో ఘనమైన ప్రగతిని సాధించాం. మహిళాలోకం మరింత పురోగాభివృద్ది సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News