Sunday, December 3, 2023

రెజ్లర్లపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు , పోలీస్‌లకు మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాదాపు నెలరోజులుగా ప్రముఖ రెజ్లర్లు ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునీయా తదితరులు రెజ్లర్లు చేస్తున్న ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆదివారం మహిళా సమ్మాన్ మహాపంచాయత్ నిర్వహించడానికి రెజ్లర్లు సమాయత్తం అయ్యారు. దీంతో పార్లమెంట్ భవనానికి రెండు కిలో మీటర్ల పరిధిలో పోలీస్‌లు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

అయినా రెజ్లర్లు పట్టించుకోకుండా కేంద్ర సర్కారు రెజ్లర్ల గోడు పట్టించుకోవడం లేదంటూ పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం వేళ అటువైపు ర్యాలీ చేపట్టడంతో రెజ్లర్లను పోలీస్‌లు జంతర్ మంతర్ వద్ద అడ్డుకున్నారు. ఆందోళన కారులను పోలీస్‌లు నిర్బంధించి బస్సులోకి ఎక్కించారు. అరెస్టయిన వారిలో రెజ్లర్లు సాక్షిమాలిక్, బజరంగ్ పూనియా ఉన్నారు. తాము బారికేడ్లు విరగ్గొట్టామా, ఇంకేమైనా హద్దులు మీరామా ? ఎందుకు తమను అరెస్టు చేశారని రెజ్లర్లు పోలీస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లర్లు శాంతిభద్రతలను ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ దీపేంద్ర పాఠక్ వెల్లడించారు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఏప్రిల్ 23 నుంచి రెజ్లర్లు కొనసాగిస్తున్న దీక్షా శిబిరాన్ని పోలీస్‌లు తొలగించారు.

రెజ్లర్లను పోలీస్‌లు అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్న దృశ్యాల వీడియోను ట్విటర్‌లో సాక్షి మాలిక్ షేర్ చేశారు. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారులతో ఇలా దురుసుగా ప్రవర్తించడం గర్హనీయమని విమర్శించారు. రెజ్లర్ల ఆందోళనకు రైతులు, పలు రాష్ట్రాల కాప్ పంచాయతీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు రెజ్లర్ల నిరసనకు మద్దతుగా మహిళా మహాపంచాయత్‌కు పిలుపు నివ్వడంతో ఖంఝావాలా చోక్ లోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్‌ను తాత్కాలిక జైలుగా ఉపయోగించుకోడానికి పోలీస్‌లు ప్రయత్నించారు. ఈమేరకు ఢిల్లీ మేయర్‌ను అనుమతి కోరగా ఆమె పోలీస్‌ల అభ్యర్థనను తిరస్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News