Friday, April 26, 2024

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రికార్డు ఆదాయం

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : సెలవుదినం కావడంతో ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయానికి రికార్డు ఆదాయం వచ్చింది. ఉదయం నుంచే సత్యనారాయణ స్వామి వ్రతం కొరకు భక్తులు బారులు తీరారు. కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి దర్శనం కొరకు భక్తులు క్యూ లైన్లలో గంట నుంచి రెండు గంటల పాటు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు.

యాదాద్రి దేవాలయానికి రికార్డు స్థాయిలో వచ్చిన ఆదాయం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు రావడంతో ఒక్కరోజు వివిధ కౌంటర్ల ద్వారా ఆదాయం రూ.1,09,82,446 ఆదాయం వచ్చింది ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ చరిత్రలో మొట్టమొదటి సారిగా రికార్డు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.

సుప్రభాత సేవ, విఐపి పూజలు, వాహన పూజలు కలిపి…

యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి టెంపుల్ సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో పునర్నిర్మాణం చేయించిన విషయం తెలిసిందే. అత్యంత సుందరంగా రూపొందిన స్వామి వారి టెంపుల్ కు గతంతో పోల్చుకుంటే భక్తులు ప్రస్తుతం పోటెత్తుతున్నారు. దీంతో ఆదివారం ఒక్కరోజే యాదాద్రి ఆలయానికి రూ. కోటి 9 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఇది ఆలయ చరిత్రలోనే ఒక్క రోజు రికార్డు ఆదాయం కావటం విశేషం. ప్రధాన బుకింగ్, సుప్రభాత సేవ, విఐపి పూజలు, వాహన పూజలు ఇలా అన్ని సేవల రూపంలో ఈ ఆదాయం వచ్చిందని ఈఓ గీతారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి సహకరించిన సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నేడు కార్తీక బహుళ షష్టి సోమవారం పురస్కరించుకొని కార్తీక తులసీ దామోదర వ్రతం నిర్వహిస్తున్నట్టు ఈఓ పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు కొండ కింద వ్రత మండపంలో ఈ వ్రతాన్ని నిర్వహిస్తామని ఈఓ తెలిపారు.

ఒక్కరోజు ఆదాయం వివరాలు ఇలా…

ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,57,650 ఆదాయం రాగా, కైంకర్యముల ద్వారా రూ.10,532ల ఆదాయం, సుప్రభాత సేవ ద్వారా రూ.3000లు, వ్రతాల ద్వారా రూ. 13,44,800లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు ప్రచార శాఖ ద్వారా రూ.2,16,500/లు, దర్శనం ద్వారా రూ.22,65,000లు, యాదరుషి నిలయం ద్వారా రూ.2,01,332/లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,550లు, పాతగుట్ట ఆదాయం ద్వారా రూ.3,37,650లు, కళ్యాణ కట్ట ద్వారా రూ.1,91,700ల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ తెలిపారు.

దీంతోపాటు శాశ్వత పూజలకు రూ.42,645లు, వాహన పూజలకు రూ.32,500లు, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.10,50,000లు,, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.2,83,160లు, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 16,200లు, శివాలయం ఆదాయం రూ.19,300లు, లక్ష్మిపుష్కరిణి, అన్నదానం ద్వారా రూ.1,78,827లు, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 6,95,100లు ఆదాయం వచ్చిందని ఆలయ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News