Monday, April 29, 2024

యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.కోటి 69 లక్షలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. శనివారం 24 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,69,83,021 (కోటి 69 లక్షల, 83 వేల, 021) రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో మిశ్రమ బంగారం 177 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 500 గ్రాములు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.

హుండీలో విదేశీ రూపాయలు అమెరికా 253 డాలర్లు, ఆస్ట్రేలియా 80 డాలర్లు, కెనడా 40 డాలర్లు, యూఏఈ 75 దిరామ్స్, కువైట్ 3, మ లేషియా 1, ఇంగ్లాండ్ 10, నేపాల్ 110,ఇస్రేల్ 20, థాయాభట్ 100,సౌదీ అరేబియా 10, కానుకరూపంలో వచ్చినట్లు తెలిపారు. ఈ ఆలయ ఉండి లెక్కింపు ఆలయ ఈఓ గీత, దేవాదాయ శాఖ ఆధికారుల పర్యవేక్షణలో కొనసాగగా ఆలయ ఉద్యోగ సిబ్బంది తదితరులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా శనివారం రోజున రూ.11,17,098 ఆదా యం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిత్యరాబడిలో అనుబంధ ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News