Saturday, February 4, 2023

వచ్చే నెలలో రైతుబంధు

- Advertisement -

మన తెలంగాణ/రఘునాథపాలెం: తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం సిఎం కెసిఆర్ ఇప్పటికే అధికారులకు ఆదే శాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద రూ.14.90కోట్లతో ని ర్మించిన 20వేల మెట్రిక్ టన్నుల సామర్థం గల మూడు గోదాములను శుక్రవారం రవా ణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్‌తో క లిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 65లక్షల మంది రైతు కుటుంబాలకు రైతుబంధు అందుతుం దని, 1.48కోట్ల ఎకరాలకు రైతుబంధు

అం దజేశామన్నారు. దేశంలో సాగుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతను తల ఎత్తుకుని నిలిచేలా చేసింది సిఎం కెసిఆర్ అన్న విషయం ఎవరూ మరిచిపోవద్దన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ సాగు ఉత్పత్తులు త్వరలోనే దేశంలోనే ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఉత్తరాదిలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోతుంటే.. తెలంగాణలో మాత్రం రాకెట్ వేగంతో పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు.

రాష్ట్రంలో 1.50కోట్ల ఎకరాల వ్యవసాయోగ్యమైన భూమి ఉందని, 1.46లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్న ఘనత రాష్ట్రానిదన్నారు. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిందని, అమెరికాలో 90కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే భారత్‌లో 40కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ అనుకూలంగా ఉందన్నారు. చైనా, అమెరికా ప్రపంచ దేశాలు దేశాలకు అన్నం పెట్టలేవని.. ప్రపంచానికి అన్నంపెట్టే స్థితిలో భారతదేశం ఉందన్నారు. దేశ యువతకు రాబోయే రోజుల్లో ఆహారరంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉత్పత్తులే రాబోయే రోజుల్లో కీలకం కాబోతున్నాయన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పండించిన పంటను రైతులు దాచుకునే వెసులుబాటులో లేకుండా పోయిందని, దానికి శాశ్విత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా వైవిద్యమైన వ్యవసాయం చేయడంలో ముందుందన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సరఫరాతో ఖమ్మం జిల్లాలో ప్రతి పంటను రైతులు స్వేచ్ఛగా పండిస్తున్నారని, ప్రతి ఏడాది ఆయా పంటల దిగుమతి సంఖ్య గణనీయంగా పెరిగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు పత్తిని అద్భుతంగా పండిస్తున్నారని, అత్యధికగా పత్తిని పండిస్తున్న వారిలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందంజలో ఉందన్నారు. కెసిఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా బీడు భూములన్నీ పచ్చరంగు పులుముకున్నాయన్నారు.

రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మినీ లిఫ్ట్‌లతో శివారు ప్రాంతాలకు సాగునీరును అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా లాభసాటి వ్యవసాయం చేయాలన్నారు. మానవ జీవన మనుగడకు నీరే మూలాధారమి, నీటిని ఒడిసిపట్టే పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జడ్పి చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, కలెక్టర్ విపి. గౌతమ్, జట్పిటిసి ప్రియాంక, ఎంపిపి మాలోతు గౌరి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మదన్‌శెట్టి హరిప్రసాద్, వైస్ ఎంపిపి గుప్తా రవి, సర్పంచులు సర్పంచ్ గుడిపూడి శారద రామారావు, గొర్రె కృష్ణవేణి శ్రీనివాస్, ఎంపిటిసి రజని, వ్యవసాయ అధికారులు భాస్కర్, కుర్ర భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, టిఆర్‌ఎస్ నాయకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles