Monday, April 29, 2024

ఎంసిఎక్స్‌లో గరిష్ఠ స్థాయిలో బంగారం ధరలు

- Advertisement -
- Advertisement -

ముంబై : బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై ఈ విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో బుల్లిష్ వాతావరణం కనిపిస్తోంది. చాలా నగరాల్లో పసిడి ధర పెరిగింది. ఎంసిఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు 0.21 శాతం పెరిగి రూ. 59,521 వద్ద ట్రేడయింది. పసిడి గరిష్ఠంగా 10 గ్రాములు రూ.59,570కి చేరగా, కనిష్టం రూ.59516కి పడిపోయింది.వెండి ధరను పరిశీలిస్తే 0.15 శాతం పెరిగి కిలో రూ.75,205 చొప్పున ట్రేడయింది. కనిష్టంగా రూ.75,099కి చేరి, ఆ తర్వాత కిలో రూ.75,280కి చేరింది. ఈ వెండి ధరలు దాని డిసెంబర్ 2023 ఫ్యూచర్‌లకు సంబంధించినవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News