Saturday, February 4, 2023

మద్యం మానేయమని చెప్పడంతో.. యువకుడు ఆత్మహత్య

- Advertisement -

పెద్దపల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన రాధారపు రమేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసులు, కథనం ప్రకారం.. తాగుడు కు బానిసగా మారిన యువకుడిని మద్యము మానివేయాలని కుటుంబ సభ్యులు చెప్పడంతో రమేష్ మానసిక వేదనకు గురైయ్యాడు. తన ఇంటిలో ఆదివారం రాత్రి మద్యం తాగి, అదే మత్తులో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడు తండ్రి గట్టు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజవర్ధన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles