Friday, September 13, 2024

ప్రియురాలు మరణం తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో గత నాలుగు రోజులక్రితం ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన తేజస్విని, శ్రీహరి ల కుటుంబాల మధ్య గొడవ జరిగింది. శ్రీహరి వేధించడం వలనో లేక ప్రేమ వ్యవహారమా తెలియదు గాని మనోవేదనకు గురైన (బి ఫార్మసీ విద్యార్థిని) తేజశ్విని భవనం పై నుండి దూకి ఆత్మహత్య కు పాల్పడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సూరారం లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. అయితే తేజస్విని మృతికి కారణం శ్రీహరి అని అందరూ అంటుండటం, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఈ విషయంలోనే ఆమె ఆత్మ హత్య చేసుకుందని అంటుండడంతో దీంతో భయంతో నలిగిపోయిన శ్రీహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని వారి కుటుంబ సభ్యులు సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స చేర్పించారు. మృతురాలు కుటుంబ సభ్యులు ఏమైనా అంటారనుకున్నాడా లేక తెలియదు గాని చికిత్స పొందుతున్న శ్రీహరి సోమవారం అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి పరారయ్యాడు.

ఈ మేరకు సూరారంపోలీస్ స్టేషన్ లో శ్రీహరి సోదరి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటినుంచి సూరారం పోలీసులు అతను ఆచూకీ కొరకు దర్యాప్తు చేస్తుండగా బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరి వేసుకొని శ్రీహరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న సూరారం పోలీసులు ఆస్పత్రి నుంచి పరారైన శ్రీహరిగా గుర్తించారు. అతను సెల్ ఫోన్ లో స్నాప్ చాట్ ద్వారా స్నేహితులకు రాసి ఉన్న ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో తన చావుకు బిజెపి నాయకుడు కారణమంటూ ఇద్దరం ప్రేమించుకున్నామని విషయాన్ని నోటు ద్వారా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో మృతుడు పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ ఇదీ నా సూసైడ్ నోట్ ప్లీజ్ మా ఇద్దరికీ న్యాయం చెయ్యండి. ముమ్మా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీవు లేకుండా అసలు అయితలే. వచ్చేస్తున్నా నీ దెగరికి నా మధ్య లేని పోనివి అన్నీ అనుకుంట్టున్నారు.

నేను చనిపోయాక అంధరికి నిజం తెలుసు. అరేయ్ రాజు రెడ్డి బి.జె.పి లీడర్ నీవే అనింటికి కారణం, తేజు వాళ్ళ నాన్నకు కూడా తెలుసు. ఇద్దరం పెళ్లి చేసుకోనికి పోయినం. ఒక మాటలో చేప్పాలి అంటే తేజు లేనిదే శ్రీ లేడు శ్రీ లేనిదే నేను లేను. మల్ల నాది వన్ సైడ్ లవ్ కాదు ఒకరంటే ఓరికి ప్రాణం. ముమ్మా నీ దెగరికే వదస్తున్న శ్రీ మమ్మీ అక్క నీవే మమ్మీని చూసుకో తేజు నీ చనిపోవడానికి కారణం మాత్రమే రాజు రెడ్డి ఇంకా మీ నాన్న మీ అన్న విలని అయితే అసలు వదలదు మా ఇద్దరి ఆత్మలకు శాంతి కావాలి అంటే వాలకు కటినంగా శిక్షించాలి. ముమ్మా అందరి మీదా ప్రేమతో నా చివరి శ్వాస వరకు నీ దెగారికి వచేస్తునా, నేన్ చనిపోయాక మన పిక్స్ బైటికి వస్తాయి అప్పుడు ఈ మీడియా వాల్లే సహాయం చెయ్యాలి నాకు నా స్నేహితులు నా అన్నలు అందరు దీనికోసం పైట్ చేయాలి అని నా ఆది నాచివరి కోరినా తేజు నా కోసం పైనా ఎదురుచూస్తుంది నేను పోతున్నా , శ్రీ మమ్మీ అక్క నువ్వే దెగ్గర ఉంది అమ్మనీ మంచిగా చూసికో నేన్ లేని లోటు నువ్వే తీర్చాలి.

అంటూ రాసి ఉండటంతో ఈ మేరకు సూరారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురు గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటారని సూసైడ్ కుటుంబ తగాదాల వల్ల జరిగి ఉంటుందని సూరారం సిఐ భరత్ కుమార్ తెలిపారు. మిస్సింగ్ కేసు క్లోజ్ చేసిన అనంతరం సూసైడ్ నోట్ దర్యాప్తు కేసు గుమ్మడిదల పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తామని సూరారం సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News