Wednesday, September 18, 2024

అత్తాపూర్ పిఎస్ పరిధిలో హత్య

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మద్యం సేవించి స్నేహితుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం….పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్‌కు చెందిన ఖలీల్(30) స్నేహితులతో కలిసి శనివారం అర్ధరాత్రి వరకు మద్యం తాగాడు. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవ జరిగింది.

దీంతో మిగతా వారు ఖలీల్‌ను కత్తులతో పొడిచారు, బాధితుడికి తీవ్ర రక్త స్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని ఇన్స్‌స్పెక్టర్ యాదగిరి సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ యాదగిరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News