- Advertisement -
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ జూనియర్‌తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ అందరినీ అలరిస్తోంది. కాలేజీ స్టూడెంట్‌గా కనిపించే హీరో కిరీటి, హీరోయిన్ శ్రీలీల మధ్య కథతో సినిమా నడుస్తుంది. టీజర్‌లో కిరీటి అదరగొట్టాడు. హీరోయిన్ శ్రీలీల కూల్‌గా కనిపించింది. టీజర్ చివరలో (end teaser) బాస్ పాత్రలో జెనీలియా డిసౌజా కనిపించడం మరింత ఆసక్తికరంగా ఉంది. జూనియర్ తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషలలో జూలై 18న గ్రాండ్ గా విడుదల కానుంది.
- Advertisement -