Tuesday, September 26, 2023

రైతులకు రుణ మాఫీ చేయాలి: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విజ్ణప్తి చేశారు. రాష్ట్రంలో 30లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

అదే విధంగా అర్హత గల పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలని కోరారు. ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలన్నారు. ఆరోగ్యశ్రీకింద ఉన్న 800కోట్లు కూడా చెల్లించి పేదలకు ఆరోగ్య సేవలను మెరుగు పరచాలని షర్మిల ఈ మేరకు ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News