Thursday, May 2, 2024

షర్మిలా డిమాండ్: తెలంగాణలో రాష్ట్రపతి పాలన!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రపతి పాలన అనే తన డిమాండ్‌కు మద్దతుగా కలిసి రావాలని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులకు రాశారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన డిమాండ్‌ను ఉంచబోతున్నానని, అందుకు ప్రతిపక్ష నేతలు కలిసిరావాలని ఆమె అభ్యర్థించారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ వాళ్లు ప్రతిపక్ష పార్టీ క్యాడర్లపై, లీడర్లపై దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిపై ప్రాణాంతక దాడులు చేస్తున్నారని అన్నారు.

ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, టిజెఎస్ నాయకుడు కోదండరామ్, బిఎస్‌పి నేత ప్రవీణ్ కుమార్, సిపిఐ(ఎం) నాయకుడు తమ్మినేని వీరభద్రం, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివ రావు, శంకర్ గౌడ్, ఎంఆర్‌పిఎస్ మంద కృష్ణ మాదిగకు ఈ మేరకు లేఖలు రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News