Thursday, June 13, 2024

మతం పేరుతో బిజిపి చిచ్చుపెడుతోంది: షర్మిల

- Advertisement -
- Advertisement -

మతం పేరుతో బిజేపి ప్రజల్లో చిచ్చు పెడుతోందని ఏపి పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శనివారం కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో బాగంగా షర్మిల మాడ్లాడుతూ వైఎస్సార్ బీజేపీ కి ఎప్పుడు వ్యతిరేకి అని, మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీఅని, వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీ కి బానిసగా మారారని ఆరోపించారు.ముస్లీం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు.చంద్రబాబు,జగన్ ఇద్దరు ముస్లీం ల పక్షాన లేరన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఎం చేసిందని వీళ్ళు బానిసలు అయ్యారో చెప్పాలన్నారు.

విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదని, హోదాపై బీజేపీ మోసం చేసిందన్నారు.వైఎస్సార్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేదని, కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారని, మూడు సార్లు శంకుస్థాపన చేశారన్నారు. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదన్నారు. కడప – బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం అని తెలిపారు.కడప నుంచి తాను పోటీ చేస్తున్నానని కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని ,వైఎస్సార్ లెక్క సేవ చేస్తానని షర్మిల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News