Thursday, April 18, 2024

ఆన్‌లైన్‌లో జూ పార్క్ సేవలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్‌కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్, మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం అరణ్యభవన్‌లో నెహ్రూ జూ పార్క్, కొత్త వెబ్ సైట్, మొబైల్ యాప్‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్ సైట్ https://nzptsfd.telangana.gov.in/home.do ను రూపొందించింది.

Zoo Park services online

వెబ్ సైట్ లో సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్, బ్యాటరీ వెహికల్స్ ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సిజిజి డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, పిసిసిఎఫ్ & హెచ్‌ఓఎఫ్‌ఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, పిసిసిఎఫ్ (ఎఫ్‌ఎసి) ఎంసి. పర్గయిన్, జూ పార్క్ డైరెక్టర్ వినయ్‌కుమార్, క్యురేటర్ రాజశేఖర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News